ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఖరారైంది. వచ్చేవారంలో ప్రధాని మోడీ అమెరికాకు వెళ్లనున్నారు. క్వాడ్ దేశాల సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో సమావేశం కానున్నారు. అనంతరం మోడి సెప్టెంబర్ 25 వ తేదీన ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశంలో కీలక ప్రసంగం చేయనున్నారు. రెండు రోజులపాటు ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్నట్టు పీఎంవో కార్యాలయం తెలియజేసింది. ఈనెల 24 వ తేదీన క్వాడ్ దేశాల సదస్సు జరగనున్నది. ఇండియా, అమెరికా, జపాన్, అస్ట్రేలియా దేశాలు క్వాడ్ దేశాల కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. కోవిడ్ ప్రధానాంశంగా ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే సైబర్, సముద్రజలాల భద్రతా, వాతావరణంలో మార్పులు తదితర అంశాలపై క్వాడ్ దేశాల నేతలు సమావేశంలో చర్చించనున్నారు.