26/11 Mumbai Terror Attacks: ముంబై దాడుల నిందితుడిని భారత్‌కు అప్పగించనున్న అమెరికా .. 30 రోజుల్లో కోర్టు నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
26/11 Mumbai Terror Attacks: 26/11 ముంబై ఉగ్రదాడుల నిందితుడిని అమెరికా, భారత్ కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా కోర్టు 30 రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. 2008లో లష్కరే తోయిబా చేసిన ముంబై దాడుల్లో పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా వ్యక్తి తహవుర్ రాణా కీలక నిందితుడి ఉన్నాడు. ఇతడిపై అమెరికా న్యాయస్థానం విచారణ చేస్తోంది. ప్రస్తుతం జైలులో ఉన్న వ్యాపారవేత్త తహవుర్ రాణా దాఖలు చేసిన స్టేటస్ కాన్ఫరెన్స్ మోషన్‌ను అమెరికా న్యాయస్థానం కొట్టేసింది.
స్టేటస్ కాన్ఫరెన్స్ మోషన్ అంటే..?
Also Read
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
స్టేట్స్ కాన్ఫరెన్స్ రిజల్యూషన్ అనేది ఒక చట్టపరమైన ప్రక్రియ. దీని ద్వారా న్యాయస్థానం ప్రాసిక్యూషన్, డిఫెన్స్ మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి రెండు వైపులా రాజీ చేసేందుకు ప్రయత్నిస్తుంది. చాలా కాలంగా ఈ కేసులో విచారణ జరగకపోవడంతో తహవూర్ రాణా తరుపు న్యాయవాది గత నెలలో ఈ ప్రతిపాదన చేశారు. ఆ అంశంపై చివరిసారిగా 21 జైలై 2021న జరిగిందని రాణా తరుపు న్యాయవాది పిటిషన్ లో పేర్కొన్నారు. నిందితుడు చాలా రోజులుగా జైలులో ఉన్నందుకు ఇరు పార్టీలు కలిసి కేసు తాజా స్థితి చర్చించాలని కోరారు. అయితే ప్రస్తుతం దీన్ని అమెరికా కోర్టు కొట్టేసింది. 30 రోజుల్లో కోర్టు నిందితుడు రాణాను భారత్ కు అప్పగించడంపై నిర్ణయం తీసుకోనుంది.
Read Also: IPL 2023 : చెలరేగిపోతున్న ఆర్సీబీ బ్యాటర్లు.. వరుస వికెట్లు తీస్తున్న పంజాబ్ బౌలర్లు
ఉగ్రదాడిలో హెడ్లీకి సహకరించిన రాణా..
తహవుర్ రాణాకు ముంబై అటాక్స్ కేసులో ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ చిన్ననాటి మిత్రుడు. లష్కరేతోయిబా ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నాయి. ఈ దాడులకు రాణా, హెడ్లీకి సహాయం చేసినట్లు అభియోగాలు ఎదుర్కొటన్నారు. ముంబై ఉగ్రదాడులకు హెడ్లీ ప్లాన్ చేసిన విషయం రాణాకు తెలుసు. ఉగ్రదాడిలో రాణా కూడా భాగమే అని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. రాణాను భారత్ కు అప్పగించాలని కోర్టులో తెలిపింది. అయితే దీన్ని అతడి న్యాయవాది వ్యతిరేకిస్తున్నారు. 2008లో లష్కరేతోయిబా చేసిన ఉగ్రదాదిలో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు సముద్రం ద్వారా ముంబైకి చేరుకుని నరమేధం సృష్టించారు. తాజ్, ఓబెరాయ్, నారీమన్ హౌజ్, సీఎస్టీ రైల్వేస్టేషన్లలో దాడులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడుల్లో ఆరుగులు అమెరికా పౌరులతో పాటు 166 మందిని చంపారు. దుబాయ్ లో రాణా, హెడ్లీ కలిసే ముంబై దాడులకు కుట్ర పన్నినట్లు తేలింది.
తాజావార్తలు
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!