USCIRF report: భారతదేశం అంటే పక్షపాతంగా వ్యవహరించే అమెరికాలోని కొన్ని సంస్థలు మరోసారి అలాంటి ప్రయత్నాన్నే చేశాయి. భారతదేశంలో మత స్వేచ్ఛ లేదని, మైనారిటీలు హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆర్ఎఫ్) తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు భారత్ లోకి కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులపై ఆంక్షలు విధించాలని బైడెన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. భారతదేశంలో 2022లోనూ భారత్ లో మతస్వేచ్ఛ పతనమవడం 2022లోనూ కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థాయిలో మతవివక్షను పెంచేలా చర్యలు తీసుకుంటున్నాయని తన నివేదికలో పేర్కొంది.
Read Also: DC vs GT: పోరాడి ఓడిన గుజరాత్.. ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం
మతాంతర వివాహాలు, గోవధ, హిజాబ్ తదితర అంశాల్లో ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, దళితులు, ఆదివాసీలు నష్టపోయేలా విధానాలు రూపొందిస్తున్నారంటూ తెలిపింది. మైనారిటీ వ్యక్తులను యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించింది. ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశాల్ని ప్రముఖంగా ప్రస్తావించాలని తన నివేదికలో చెప్పింది. అయితే అమెరికా ప్రభుత్వం ఈ సూచల్ని పాటించవచ్చు, పాటించకపోవచ్చు.
ఇదిలా ఉంటే యూఎస్‌సీఐఆర్ఎఫ్ నివేదికను భారత్ తీవ్రంగా తోసిపుచ్చింది. భారతదేశం గురించి పక్షపాతంగా వ్యవహరించిందన భారత విదేశాంగ శాక స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చింది. ఈ నివేదిక ట్రాష్ అంటూ కొట్టిపారేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్టాడుతూ.. భారత్ లోని వాస్తవాలను తప్పుగా చూపిస్తోందని నివేదికను తిరస్కరించారు. భారతదేశంపై మెరుగైన అవగాహన పెంచుకోవాలని యూఎస్‌సీఆర్ఐఎఫ్ కి సూచించింది. ఈ నివేదిక ఆ సంస్థను అప్రతిష్టపాలు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అరిందమ్ బాగ్చీ అన్నారు.