అమెరికాలో గన్ కల్చర్ పై విమర్శలే ఉన్నాయి. ఈ క్రమంలోనే తుపాకి హింసను కట్టడి చేసేందుకు న్యూయార్క్ అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న గన్ లను ఇస్తే.. గిఫ్ట్ కార్డులు ఇస్తామని ప్రకటించింది. దీంతో వేల మంది పౌరులు ముందుకొచ్చి తమ దగ్గర ఉన్న ఆయుధాలను అధికారులకు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహఇంచారు. ఇప్పటి వరకు మూడు వేలకు పైగా తుపాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల వద్ద నుంచి 3,076 తుపాకులను స్వాధీనం చేసుకున్నామన్నారు.
Also Read : Astrology : మే 02, మంగళవారం దినఫలాలు
ఇందులో 185 భారీ ఆయుధాలు ఉన్నాయి. ఒక్కో తుపాకినీ స్వాధీనం చేసుకోవడం అంట.. ఒక్కో విషాద ఘటన జరిగే అవకాశాన్ని నిర్మూలించినట్లే అని అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ట్వీట్ చేసింది. తుపాకీ హింస నుంచి న్యూయార్క్ వాసులను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. మొదటి ఆయుధాన్ని అప్పగించిన వారికి దాని రకాన్ని ( హ్యాండ్ గన్, అసాల్ట్ రైఫిల్, ఘోస్ట్ గన్, షాట్ గన్, 3డీ ప్రింటెడ్ గన్ ) బట్టి అత్యధికంగా 500 డాలర్ల వరకు గిఫ్ట్ కార్డులను పొందుతున్నారు.
Also Read : Telangana Congress : ఈ నెల 8న తెలంగాణకు ప్రియాంక గాంధీ.. నేడు పార్టీ ముఖ్యులతో థాక్రే సమావేశం
ఆపై ప్రతి ఆయుధానికి అదనంగా గిఫ్ట్ కార్డులు అందజేశారు. ఇక్కడి సిరాక్యూజ్ నగరం నుంచి అత్యధికంగా 751 ఆయుధాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 5 వేల డాలర్ల వరకు అందుకున్నాట్లు వెల్లడించాడు. బ్రూక్లిన్ లో తొలి మూడు గంటల్లోనే 90 తుపాకులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.