Joe Biden: బైడెన్‌కు మతిమరుపు వచ్చిందా..? చివరి విదేశీ పర్యటన కూడా గుర్తు లేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joe Biden: అమెరికా ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. 2024 ఎన్నికల కోసం డెమెక్రాట్ల తరుపున మరోసారి జో బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఇదిలా ఉంటే రిపబ్లికన్ల తరుపును మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జో బైడెన్ మరోసారి విపక్షాలకు టార్గెట్ అయ్యారు. గతంలో కొన్ని సందర్భాల్లో జో బైడెన్ తడబడటం, మనుషుల్ని పోల్చుకోకపోవడం వంటి సంఘటనలతో వార్తల్లో నిలిచారు.
Read Also: Haryana: దారుణం.. భార్య చేతులు, తల నరికి నిప్పంటించిన వ్యక్తి..
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
తాజాగా తాను చివరిసారిగా పర్యటించిన విదేశీ పర్యటనను కూడా జో బైడెన్ గుర్తుతెచ్చుకోలేక ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైట్‌హౌస్‌లో ‘టేక్ యువర్ చైల్డ్ టు వర్క్ డే’ కార్యక్రమంలో ప్రెసిడెంట్ జైడెన్ పాల్గొన్నారు. పిల్లలతో సంభాషించారు. అయితే ఈ సమయంలో ఓ పిల్లాడు, మీరు చివరిసారిగా పర్యటించిన దేశం ఏమిటి..? అని బైడెన్ ను ప్రశ్నించారు. అయితే తాను పర్యటించిన దేశం పేరు గుర్తు తెచ్చుకోవడానికి ఆయన చాలా సేపు ప్రయత్నించారు. ‘‘నేను ప్రయాణించిన చివరి దేశం, నేను చివరిగా ప్రయాణించిన దేశం గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఇప్పటివరకు 89 మంది దేశాధినేతలను కలిశాను.చివరిగా ఎక్కడ ఉన్నానో ఆలోచించడం, ట్రాక్ చేయడం కష్టం.’’ అంటూ సమాధానం ఇచ్చారు.
మరో పిల్లాడు ఐర్లాండ్ అంటూ సమాధానం ఇచ్చాడు. జోబైడెన్ చివరిసారిగా ఐర్లాండ్ లో పర్యటించారు. తాను ఎందుకు అధ్యక్షుడిని అవ్వాలనుకున్నాననే విషయాలను పిల్లలతో పంచుకున్నారు. తన మనవరాళ్ల గురించి, తనకు ఇష్టమైన ఐస్ క్రీం, ఇష్టమైన రంగు గురించి పిల్లలతో సరదాగా ముచ్చటించారు.
Joe Biden couldn't remember the last country he traveled to as president, which a child reminded him was Ireland literally a week ago. pic.twitter.com/lLtExbaJe0
— Greg Price (@greg_price11) April 27, 2023
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?