26/11 Mumbai terror attacks: 26/11 ముంబై ఉగ్రదాడులు సూత్రధారి తహవూర్ రాణాను అమెరికా, భారత దేశానికి అప్పగించనుంది. 2008లో జరిగి ఈ దాడి యావత్ దేశంతో పాటు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేసింది. నిందితుల్లో ఒకడిగా ఉన్న తహవూర్ రాణాను భారత్ కు అప్పగించడానికి అక్కడి కాలిఫోర్నియా కోర్టు అంగీకరించింది. భారత్-అమెరికాల మధ్య ఉన్న నేరస్తుల ఒప్పగింత ఒప్పందానికి అనుగుణంగా ఈ తీర్పు వచ్చింది.
Read Also: Imran Khan: “బంగ్లాదేశ్” లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు.. ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్..
2008లో జరిగిను ముంబై ఉగ్రదాడిలో అమెరికా జాతీయుడైన తహవూర్ రాణా ఆర్థిక సాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం రాణా అమెరికా పోలీసులు అదుపులో ఉన్నాడు. ఉగ్రవాదానికి సాయం చేశాడనే ఆరోపణల కింద గతంలో షికాగో కోర్టు అతనికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇతనితో పాటు డెవిడ్ కోల్మన్ హెడ్లీ కూడా ముంబై ఎటాక్స్ లో కీలకంగా వ్యవహరించాడు.
తహవుర్ రాణాకు ముంబై అటాక్స్ కేసులో ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ చిన్ననాటి మిత్రుడు. లష్కరేతోయిబా ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నాయి. ఈ దాడులకు రాణా, హెడ్లీకి సహాయం చేసినట్లు అభియోగాలు ఎదుర్కొటన్నారు. ముంబై ఉగ్రదాడులకు హెడ్లీ ప్లాన్ చేసిన విషయం రాణాకు తెలుసు. ఉగ్రదాడిలో రాణా కూడా భాగమే అని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. 2008లో లష్కరేతోయిబా చేసిన ఉగ్రదాదిలో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు సముద్రం ద్వారా ముంబైకి చేరుకుని నరమేధం సృష్టించారు. తాజ్, ఓబెరాయ్, నారీమన్ హౌజ్, సీఎస్టీ రైల్వేస్టేషన్లలో దాడులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడుల్లో ఆరుగులు అమెరికా పౌరులతో పాటు 166 మందిని చంపారు. దుబాయ్ లో రాణా, హెడ్లీ కలిసే ముంబై దాడులకు కుట్ర పన్నినట్లు తేలింది.