New York Sinking: నేలలో కూరుకుపోతున్న న్యూయార్క్ నగరం.. తాజా అధ్యయనంలో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New York Sinking: అమెరికాలోని అతిపెద్ద నగరం, ప్రపంచంలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన న్యూయార్క్ నెమ్మనెమ్మదిగా భూమిలోకి కూరుకుపోతుందని పరిశోధకలు సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. న్యూయార్క్ లోని అతిపెద్ద భవంతులు క్రమంగా నేలలోకి జారుకుంటున్నాయని పరిశోధన పేర్కొంది. నగరంలోని భవనాల బరువు కారణంగా సమీపంలోని నీటిలోకి మునిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ పరిస్థితిని సైన్స్ పరిభాషలో ‘ సబ్సిడెన్స్’ అంటారని పరిశోధకులు వెల్లడించారు.
Read Also: The Kerala Story: “ది కేరళ స్టోరీ”కి ఊరట.. పశ్చిమ బెంగాల్ నిషేధంపై స్టే విధించిన సుప్రీంకోర్టు..
Also Read
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
- US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
న్యూయార్క్ మొత్తంలో మొత్తం 10 లక్షల భవనాల బరువు దాదాపుగా 1.7 ట్రిలియన్ పౌండ్లు( అంటే 764,000,000,000 కిలోలు) అని పరిశోధకులు తెలిపారు. ప్రతీ ఏడాది 1-2 మిల్లీమీటర్ల చొప్పున నగరం కూరుకుపోతుందని కనుగొన్నారు. యూనివర్శిటీ ఆఫ్ రోడ్ ఐలాండ్‌లోని యుఎస్ జియోలాజికల్ సర్వే మరియు జియాలజిస్టులు ఈ పరిశోధనను చేపట్టారు. ఈ అధ్యయనం ఎర్త్ ఫ్యూచర్ జర్నల్‌లో ప్రచురించబడింది. ఉపగ్రహాల డేటాతో పోల్చి చూసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లోయర్ మాన్ హట్టన్ వేగంగా కిందకు వెళ్తోందని, బ్రూక్లిన్, క్వీన్స్ ప్రాంతాల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని పరిశోధన తెలిపింది.
న్యూయార్క్ దీంతో పాటు సముద్ర మట్టాల పెరుగుదల కారణంగా వరద ముప్పు ఎదుర్కొనే నగరాల్లో ఒకటిగా ఉంది. ఉత్తర అమెరికా అట్లాంటిక్ తీరం వెంబడి, ప్రపంచ సగటు కన్నా 3-4 రెట్లు సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. 84 లక్షల జనాభా ఉండే న్యూయార్క్ నగరం వివిధ స్థాయిల్లో ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని అమెరికా జియోలాజకిల్ సర్వేకు చెందిన పరిశోధకుడు, భూగర్భ శాస్త్రవేత్త టామ్ పార్సన్స్ నివేదికలో వెల్లడించారు. పెరుగుతున్న ప్రమాదాలను ఎదుర్కొనేందుకు వ్యూహాలను రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!