Kim Jong Un: కిమ్ కూతురు ఎలా ఉందో చూడండి.. శాటిలైట్ పరిశీలనకు వచ్చిన తండ్రీకూతుళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kim Jong Un: ఉత్తర కొరయా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తన కూతురుతో కలిసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్ నార్త్ కొరియా అధినేతగా కిమ్ కూతరు ఉండబోతుందనే వార్తల నేపథ్యంలో ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో కిమ్ తన కూతురు ‘జూఏ’తో కలిసి క్షిపణి పరీక్షలు, ఇతర కార్యక్రమాలకు హాజరవుతున్నారు. నార్త్ కొరియా కొత్తగా ప్రయోగిస్తున్న స్పై శాటిలైట్ పనులను ఆయన కూతురుతో కలిసి సమీక్షించారు. మంగళవారం ఆయన నాన్-పర్మనెంట్ శాటిలైట్ లాంచ్ ప్రిపరేటరీ కమీటీని కలిశారని నార్త్ కొరియా అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది. ఈ సమయంలో ఆయన వెంట కూతురు జూఏ ఉన్న ఫోటోలను విడుదల చేసింది.

Also Read
Read Also: JP Nadda: అమెరికా, చైనా, జపాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.. కారణం ఇదే..
గత నెల క్రితమే ఈ ఉపగ్రహ ప్రయోగానికి కిమ్ పచ్చ జెండా ఊపాడు. నార్త్ కొరియా కొత్త సాలిడ్ ఫ్యూయల్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన వారం తరువాత ఏప్రిల్ 18న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించిన వివరాలను శాస్త్రవేత్తల నుంచి కిమ్ అడిగి తెలుసుకున్నాడు. శాటిలైట్ పరీక్షకు సిద్ధంగా ఉందని కేసీఎన్ఏ తెలిపింది. అమెరికా, సౌత్ కొరియాలు ఉద్రిక్తతలను పెంచుతున్నాయని ఆరోపిస్తున్న కిమ్.. అణు ప్రయోగాలను, క్షిపణి ప్రయోగాలను వేగంగా నిర్వహిస్తున్నాడు.
2021లో కిమ్ ఈ కీలక ప్రాజెక్టులో ఈ సైనిక నిఘా ఉపగ్రహం ఒకటి. అయితే దీన్ని ఎప్పుడు ప్రయోగిస్తారనే తేదీని మాత్రం నార్త్ కొరియా వెల్లడించలేదు. నార్త్ కొరియా సొంత టెక్నాలజీ లేదా రష్యా, చైనా నుంచి వచ్చిన సాంకేతికతతో ఈ నిఘా ఉపగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!