Brain Surgery On Baby In Womb: అమెరికన్ వైద్యులు అత్యంత అరుదైన బ్రెయిన్ సర్జరీ చేశారు. గర్భంలో ఉన్న శిశవుకు విజయవంతంగా బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. ఇలా గర్భంలో ఉన్న శిశువుకు శస్త్రచికిత్స చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. మెదడులో అరుదైన రక్తనాళాల అసాధారణ పరిస్థితిని సరిచేసేందుకు వైద్యులు ఈ సర్జరీని నిర్వహించారు. ‘‘వీనస్ ఆఫ్ గాలెన్ మాల్ ఫార్మెషన్’’(VOGM) అనే అరుదైన వైకల్యంతో బాధపడుతున్న శిశువుకు బ్రిఘం అండ్ ఉమెన్స్ హాస్పిటల్, బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు సర్జరీ చేశారు.
మెదడు నుంచి గుండెకు రక్తాన్నీ తీసుకెళ్లే రక్తనాళం సరిగ్గా అభివృద్ధి చెందనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల అధిక మొత్తంలో రక్తం సిరలు, గుండెపై ఒత్తిడి పెంచుతుంది. ఇది దీర్ఘకాలంలో పలు ఆరోగ్య పరిస్థితులకు దారి తీయవచ్చని వైద్యులు తెలిపారు. మెదడుకు గాయాలు, గుండె వైఫల్యం వంటి సవాళ్లను శిశువు ఎదుర్కొనే అవకాశం ఉందని డాక్టర్ డారెన్ ఓర్బాచ్ తెలిపారు. సాధారణంగా శిశువు పుట్టిన తర్వాత రక్తప్రవాహాన్ని మందగించడానికి చిన్న కాయిల్స్ ను చొప్పించడానికి కాథెటర్ ను ఉపయోగించి చికిత్స చేస్తారు. అయితే ఈ రకం చికిత్స చాలా ఆలస్యంగా జరుగుతుంది. ఈ పరిస్థితి ఉన్న శిశువుల్లో 50 నుంచి 60 శాతం మంది వెంటనే అనారోగ్యానికి గురవుతారు. 40 శాతం మంది మరణించే అవకాశం ఉంది. జీవించి ఉన్న శిశువుల్లో తీవ్రమైన నరాల జబ్బులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
Read Also: Karnataka Elections: కర్ణాటకలో అధికారం ఎవరిది..? ఒపీనియన్ పోల్స్ చెబుతున్నది ఇదే..
శిశువు తల్లి గర్భంలో ఉన్న సమయంలో ఆల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తున్న సమయంలో మెదడులో అరుదైన రక్తనాళ అసాధారణతను కనుగొన్నారు. ఈ పరిస్థితి చాలా మంది పిల్లల గుండె వైఫల్యం, మెదడు దెబ్బతినే పరిస్థితిని ఏర్పరస్తుంది. శిశువు గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 34 వారాల గర్భంలో శిశువుకు బోస్టన్ చిల్డ్రన్స్, బ్రిఘామ్ వైద్యులు ఆల్ట్రాసౌండ్ ఉపయోగించి, అమ్నియోసెంటెసిస్ కోసం ఉపయోగించే సూది, చిన్న కాయిల్స్ ను ఉపయోగించి, అసాధారణంగా ఉన్న రక్తనాళాల్లోకి వీటిని జొప్పించి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.
గాలెన్ వైకల్యం అంటే..?
వైద్యులు చెబుతున్నదాని ప్రకారం.. గాలెన్ వైఫల్యం (VOGM)లో మెదడులో సిరల్లో ఏర్పడే ఓ సమస్య. మెదడులోని మిస్‌షేపెన్ ధమనులు కేశనాళికలతో కనెక్ట్ కాకుండా నేరుగా సిరలతో కనెక్ట్ అవుతాయి. దీని వల్ల రక్త ప్రవాహాన్ని నెమ్మదించేలా చేస్తుంది. దీంతో అధిక పీడనంతో రక్తం సిరల్లో ప్రవహిస్తుంది. ఇది సిరలు, గుండెపై ఒత్తడి పెంచేలా చేస్తుంది.