2024 గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జోబ బైడెన్ ని ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించారని అమెరికా రాయబారి తెలిపారు. దీంతో భారత్-అమెరికాల మధ్య బంధం మరింగా బలపడే అవకాశం ఏర్పడుతుంది.
Canada Issue: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత్ కారణమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించడం రెండు దేశాల మధ్య దౌత్య వివాదానికి కారణమైంది. ఇరుదేశాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించుకోవడంతో ఈ ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఇప్పటికే ఈ వివాదంపై అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు తమ ఆందోళనలను తెలియజేశాయి.
Vivek Ramaswamy: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. 2024లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపధ్యంలో రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల్లో అధ్యక్ష అభ్యర్థిత్వంపై పోటీ జరుగుతోంది. ఈ సారి అధ్యక్ష బరిలో ఇద్దరు భారతీయ అమెరికన్లు రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు
Indian Student Death: భారతీయ విద్యార్థి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జాహ్నవి కందుల అమెరికాలో మరణించడం, ఆ తరువాత అక్కడి పోలీస్ అధికారి ఆమె మరణం గురించి హేళన చేస్తూ, చులకనగా మాట్లాడటం ఇటు ఇండియాలో, అటు అమెరికాలో వైరల్ గా మారింది. జనవరి నెలలో పెట్రోలింగ్ చేస్తున్న కారు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. అయితే పోలీస్ అధికారి ఆమె మరణాన్ని తేలిక చేస్తూ మాట్లాడటం,
Flight Emergency: అమెరికాలో ఓ విమానం తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. 10 నిమిషాల్లోనే ఏకంగా 28,000 అడుగుల దిగువకు విమానం చేరింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు గుండె జారిన పనైంది. చివరకు ఎలాగొలా సేఫ్ ల్యాండింగ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. యునైటెడ్ ఎయిర్లైన్స్ కి చెందిన విమానం బుధవారం అమెరికా నేవార్క్ నుంచి రోమ్కి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
Pig kidney In Human: మానవ అవయవాలు విఫలమైతే వేరే వ్యక్తులు దానం చేస్తేనే జీవితం సాఫీగా సాగుతుంది. అయితే కొన్ని సందర్బాల్లో అవయవాలు దొరకకపోవడం, దొరికినా సెట్ కాకపోవడం వల్ల మనుషులు మరణిస్తున్నారు. అవయవాల కొరతకు పరిష్కారం కనుగొనేందుకు శాస్త్రవేత్తలు, వైద్యులు కొన్ని ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇటీవల జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీని మానవుడికి అమర్చారు. ఇది ఏకంగా రెండు నెలల పాటు పనిచేసింది, భవిష్యత్తులపై ఆశలను పుట్టించింది. బ్రెయిన్ డెడ్ అయి, వెంటిలేటర్…
China: జపాన్ లోని అమెరికా రాయబారి రహమ్ ఇమ్మాన్యుయేల్ ఎక్స్(ట్విట్టర్)లో ఓ పోస్టు చేశారు. ‘మొదటిది రక్షణ మంత్రి లీ షాంగ్ఫు 3 వారాల నుంచి కనిపించడం లేదు. రెండోది అతడిని గృహనిర్భందంలో ఉంచినందుకే వియత్నా పర్యటనలో కనిపించలేదు, సింగపూర్ నేవీ చీఫ్ తో సమావేశం కాలేదు..?’ అంటూ వ్యాఖ్యానించారు.
India: అమెరికాలో రోడ్డు ప్రమాాదంలో మరణించిన తెలుగు యువతి మరణించడం.. ఆ మరణాన్ని తక్కువగా చూపుతూ పోలీస్ అధికారి చులకనగా మాట్లాడటంపై అమెరికా దర్యాప్తు చేయాలని ఇండియా కోరంది. వేగంగా వస్తున్న పోలీస్ పెట్రోలింగ్ కార్ ఢీకొట్టి ఆంధ్రప్రదేశ్ కి
Kim Jong Un: అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలకు ఒత్తిడిని లెక్క చేయకుండా ఉత్తకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటనకు వెళ్లారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో భేటీ కానున్నారు. కిమ్ తన ప్రత్యేక రైలులో ఉత్తర కొరియా నుంచి రష్యాలో వ్లాదివోస్టోక్కి ఆదివారం వెళ్లారు.