కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటనలు మనం చాలానే చూసుంటాం. అయితే ఎలుకలు దాడి చేసి చంపిన ఘటనలు పెద్దగా మనం చూసి ఉండం, విని ఉండం. అయితే ఆరునెలల పసికందును ఓ ఎలుకల గుంపు కొరికి కొరికి దారుణంగా చంపింది. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. అయితే దీనికి ప్రధాన కారణం ఇళ్లు పరిశుభ్రంగా లేకపోవడమే. పసికందు చనిపోవడంతో తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Road Accident: శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొట్టిన కంటైనర్, లారీ, కారు
ఊయలలో నిద్రిస్తున్న ఆరు నెలల పసికందుపై ఎలుకల గుంపు దాడి చేసింది. మొత్తం 50 సార్లకు పైగా ఆ చిన్నారిని ఎలుకలు కొరికాయి. ఎంతలా ఎలుకలు కరిచాయి అంటే ఆ దాడిలో చిన్నారి ఎముకలు కూడా బయటకు వచ్చేశాయి. ముఖం, కాళ్లు, చేతులు ఇలా శరీరంలోని ప్రతి భాగంపై దాడి చేసి కొరికి తినేశాయి ఆ ఎలుకల గుంపు. ఇంత జరగుతున్న ఎలుకల దాడితో చిన్నారి అరుస్తున్నా ఎవరు రాకపోవడం గమనార్హం. అయితే చాలా సేపటికి అక్కడికి వచ్చిన చిన్నారి తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉన్న బిడ్డను చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటన స్థానిక ఇండియానా (Indiana) ప్రాంతంలో ఆగస్టు 13వ తేదీన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న ఇండియానా పోలీసులు అక్కడి చేరుకొని ఆ ఇంటిని పరిశీలించారు. కుటుంబం నివసించే ఇల్లంతా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఇల్లంతా చెత్తాచెదారంతో నిండిపోయి ఉండటంతో అది ఎలుకలకు ఆవాసంగా మారిందని తెలిపారు. కుటుంబంలో చాలా మందిని అనేక సార్లు ఎలుకలు కరిచిన ఆ తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు. ఆ దంపతులకు చనిపోయిన పసికందు కంటే ముందే నలుగురు పిల్లలు ఉన్నాు. వీరే కాక మరో ఇద్దరు పిల్లలు కూడా వారితో కలిసి ఉంటున్నారు. వారిని కూడా ఎలుకలు కరిచినప్పటికీ ఆ దంపతులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఇళ్లు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, నిర్లక్ష్యం కారణంగా చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్ల భావించిన పోలీసులు దంపతులతో పాటు అక్కడే ఉంటున్న ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఈ ఘటన చూస్తుంటే పరిశుభ్రంగా ఉండటం ఎంతో ముఖ్యమో అర్థం అవుతుంది.