US Visa: భారత్, అమెరికాల మధ్య ఇటీవల కాలంలో బంధం బలపడుతోంది. ఇటీవల కాలంలో భారతదేశానికి అగ్రరాజ్యం పెద్దపీట వేస్తోంది. భారతీయులకు వీసాలను జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది 10 లక్షల మంది భారతీయులకు అమెరికా వీసాలను మంజూరు అయ్యాయి. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికా రాయబార కార్యాలయం తన అధికార సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అన్ని రకాల వీసాలు కలిసి…
Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఒకటిన్నరేళ్లు గడుస్తున్నాయి. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య యుద్ధం సద్దుమణగలేదు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలనై పట్టు నిలుపుకునేందుకు రష్యా, ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ కి అమెరికా, యూకే, కెనడా వంటి వెస్ట్రన్ దేశాలు మద్దతు పలుకుతున్నాయి. దీంతో పాటు ఉక్రెయిన్ కి కావాల్సిన ఆయుధ, ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి.
North Korea: ప్రపంచం అంతా ఒకలా ఉంటే నార్త్ కొరియా మాత్రం మరోకలా ఉంటుంది. బయటి ప్రపంచంతో అక్కడి ప్రజలకు ఎలాంటి సంబంధాలు ఉండవు. ఫాల్స్ ప్రాపగండాతో ఆ దేశం నడుస్తుంది. అక్కడి కిమ్ జోంగ్ ఉన్ చెప్పిందే చట్టం, చేసిందే న్యాయం. కాదని ఎదురు తిరిగారో కుక్క చావే. అలాంటి దేశంలోకి వేరే దేశం వాళ్లు వెళ్లడం అంటే సింహం నోట్లో తలపెట్టినట్లే. ఇక అమెరికా పౌరుడైతే చావే గతి.
USA: అమెరికాలో ఫిలడెల్ఫియాలో ఘరానా దోపిడి జరిగింది. క్షణాల్లో యాపిల్ స్టోర్లు, ఇతర షాపుల్ని కొల్లగొట్టారు. ఇప్పుడు ఈ దోపిడికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 100 మందికి పైగా ముసుగులు ధరించిన యువకులు ఫిలడెల్ఫియాలోని సిటీ సెంటర్ షాపుల్లోకి చొరబడి దోచుకున్నారు. మంగళవారం రాత్రి ‘ప్లాష్ మాబ్’ తరహాలో దోపిడికి పాల్పడ్డారు.
Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ రసవత్తంగా మారింది. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల్లో అభ్యర్థులు తలపడుతున్నారు. ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో పాటు ఇండో అమెరికన్ల వివేక్ రామస్వామి, నిక్కీహేలీలు పోటీలో ఉన్నారు. అయితే ఇటీవల వివేక్ రామస్వామి తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు
US presidential race: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. 2024లో యూఎస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి, ఈ నేపథ్యంలో అక్కడి ప్రెసిడెంట్ రేసు మొదలైంది. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల్లో అధ్యక్ష బరిలో నిలిచేందుకు పలువురు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీలో ఈ పోటీ ఎక్కువగా ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఇండో అమెరికన్లు వివేక్ రామస్వామి, నిక్కీ హెలీ లాంటి వారు పోటీలో ఉన్నారు.
FBI warned US Khalistani elements: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఈ ఏడాది జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో కాల్చి చంపారు. ఇప్పుడు ఈ హత్య కెనడా, ఇండియా మధ్య దౌత్యపరమైన వివాదానికి కారణమైంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా భారత దౌత్యవేత్తను బహిష్కరిస్తే , భారత్ కూడా దెబ్బకు దెబ్బ…
Nikki Haley: అమెరికా అధ్యక్ష బరిలో ఉండేందుకు ఇండో - అమెరికన్ నిక్కీ హేలీ రిపబ్లికన్ పార్టీ తరుపున ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రిపబ్లిక్ పార్టీ తరుపున వివేక్ రామస్వామి, డొనాల్డ్ ట్రంప్ తరువాత రెండోస్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా నిక్కీ హేలీ చైనాను ఉద్దేశించి కీలక హెచ్చరికలు చేశారు. న్యూ హాంప్ షైర్ లో జరిగిన ఆర్థిక వ్యవస్థపై మేజర్ పాలసీపై ఆమె మాట్లాడారు.
కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటనలు మనం చాలానే చూసుంటాం. అయితే ఎలుకలు దాడి చేసి చంపిన ఘటనలు పెద్దగా మనం చూసి ఉండం, విని ఉండం. అయితే ఆరునెలల పసికందును ఓ ఎలుకల గుంపు కొరికి కొరికి దారుణంగా చంపింది. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. అయితే దీనికి ప్రధాన కారణం ఇళ్లు పరిశుభ్రంగా లేకపోవడమే. పసికందు చనిపోవడంతో తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. Also Read: Road Accident: శంషాబాద్…
Woman Swallow Ear Pod in USA: మనం ఏదైనా చేసేటప్పుడు శ్రద్దగా చేయడం చాలా అవసరం. ముఖ్యంగా తినే విషయంలో, ఏవైనా తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చాలా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాగే టాబ్లె్ట్లు వేసుకునే విషయంలో జాగ్రత్త తీసుకోని ఓ మహిళకు విచిత్ర పరిస్థితి ఏర్పడింది. విటమిన్ టాబ్లెట్ అనుకొని మహిళ ఎయిర్ పోడ్స్ మింగేసింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. Also Read: MP Ramesh Bidhuri:…