2024 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ని ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించారని అమెరికా రాయబారి తెలిపారు. జనవరి 26, 2024 గణతంత్ర వేడుకలకు హాజరు కావాల్సిందిగా ప్రెసిడెంట్ జో బైడెన్ ని ప్రధాని ఆహ్వానించినట్లుగా భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ తెలిపారు. జీ20 సదస్సుకు ముందు రోజు ఇరువురు దేశాధినేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో మోడీ కోరినిట్లు గార్సెట్టి చెప్పారు.
Read Also: Pakistan: ఏంటీ బాబు నీకు అమ్మాయిలు దొరకలేదా.. అమ్మమ్మను పెళ్లి చేసుకున్నావ్!
భారతదేశ వ్యూహాత్మక, దౌత్య, ఆర్థిక ప్రయోజనాలు, ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకుని రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. 2023 గణతంత్ర వేడుకలకు ఈజిఫ్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తే ఆల్ సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గతంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (2015), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (2007), ఫ్రాన్స్ మాజీ అధ్యక్షులు నికోలస్ సర్కోజీ (2008), ఫ్రాంకోయిస్ హోలాండే (2016) కూడా గతంలో గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.