Sophia Leone: అడల్ట్ ఫిల్మ్‌స్టార్స్ వరసగా మరణిస్తున్నారు. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. 26 ఏళ్ల సోఫియా లియోన్ ఈ నెల ప్రారంభంలో తన అపార్ట్‌మెంట్‌లో మరణించింది. ఈ విషయాన్ని ఆమె సవతి తండ్రి మైక్ రొమెరో శనివారం తెలిపారు. మార్చి 1న యూఎస్‌లోని ఆమె అపార్ట్‌మెంట్‌లో సోఫియా అచేతన స్థితిలో ఉండగా ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు.
‘‘ ఆమె తల్లి, కుటుంబం తరుపున, మా ప్రియమైన సోఫియా మరణించిన వార్తను నేను భారమైన హృదయంతో పంచుకుంటున్నాను’’ని రోమెరో చెప్పారు. సోఫియా మరణం ఆకస్మిక మరణం ఆమె కుటుంబం, స్నేహితులకు విధ్వంసం, దిగ్భ్రాంతికి గురిచేసింది. సోఫియా కోసం న్యాయం కోరే కష్టమైన ప్రక్రయ పైనే కుటుంబం సిద్ధంగా లేని ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోంది అని రోమిరో జోడించారు.
Read Also: Miss World 2024 : మిస్ వరల్డ్ 2024 గెలుచుకున్న క్రిస్టినా పిజ్కోవా బ్యాక్ గ్రౌండ్ ఇదే
మరణానికి గల కారణాలను స్థానిక పోలీసులు విచారిస్తున్నారు. ఆమె మోడలింగ్ ఏజెన్సీ-101 మోడలింగ్ కూడా ఈ వార్తని ధృవీకరించింది. మా ప్రియమైన సోఫియా లియోన్ అకాల, విషాదకరమైన మరణంతో మా హృదయాలు ముక్కలయ్యాయి అని చెప్పింది. రిప్ స్వీట్ ఎంజెల్ అని ఎక్స్‌లో ట్వీట్ చేసింది.
ఆమె ఆత్మహత్యతో చనిపోలేదని, ఎవరైనా హత్య చేసుంటారా..? అనే కోణంలో దర్యాప్తు చేయబడుతోంది. సోఫియా లియోన్ 18 ఏళ్ల వయసులో అడల్ట్ పరిశ్రమలోకి వచ్చింది. సోఫియా లియోన్ జూన్ 10, 1997లో అమెరికాలోని మియామిలో జన్మించింది. అడల్ట్ పరిశ్రమలో వరసగా పలువురు స్టార్స్ మరణించడం ఇటీవల కాలంలో అందర్ని షాక్‌కి గురిచేస్తోంది. లియోన్‌కి ముందు కాగ్నీ లిన్ కార్టర్, జెస్సీ జేన్ మరియు థైనా ఫీల్డ్స్ అనుమానాస్పద రీతిలో మరణించారు.