CAA: సీఏఏ మతపర వివక్ష చూపిస్తోంది.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అసహనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CAA: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకు సంబంధించి పలు అంతర్జాతీయ సంస్థలు తప్పుబడుతున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో పాటు ఐక్యరాజ్యసమితి, అమెరికాలు దీనిపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి. భారత్ తీసుకువచ్చిన సీఏఏ సమానత్వం, మతపరమైన వివక్షత, భారతదేశ అంతర్జాతీయ మానవహక్కుల బాధ్యతలకు అసంబద్ధమని, రాజ్యాంగ విలువలకు దెబ్బగా అభివర్ణించింది. ‘‘పౌరసత్వ సవరణ చట్టం అనేది మతం ఆధారంగా వివక్షను చూపిస్తోందని, ఇది మతోన్మాద చట్టం అని, దీనిని అమలు చేయకూడదు. దేశవ్యాప్తంగా ప్రజలు, పౌర సమాజం, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు మరియు ఐక్యరాజ్యసమితి నుండి CAAని విమర్శించే అనేక స్వరాలను వినడంలో భారత అధికారులు విఫలమయ్యారు’’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రతినిధి ఆకర్ పటేల్ అన్నారు.
Read Also: Anupama Parameswaran: కలువ పువ్వు లాంటి కళ్ళతో మాయచేస్తున్న అనుపమ పరమేశ్వరన్..
Also Read
- Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
- Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
- Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
- Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
మరోవైపు ఐక్యరాజ్యసమితి(UN)..ఇది ప్రాథమికంగా వివక్షతతో కూడిన స్వభావం అని వర్ణించింది. యూఎన్ మానవహక్కుల హైకమీషనర్ కార్యాలయ ప్రతినిధి మాట్లాడుతూ.. మేము 2019లో సీఏఏ వివక్షతతో కూడి స్వభావం కలిగినదని, భారతదేశం అంతర్జాతీయ మానవహక్కలను బాధ్యతలను ఉల్లంఘిస్తోదని ఆందోళన చెందుతున్నామని అన్నారు. ఈ చట్టం అంతర్జాతీయ మానవహక్కుల చట్టానికి లోబడి ఉందో లేదో తమ కార్యాలయం అధ్యయనం చేస్తోందని అధికారి తెలిపారు. అమెరికా కూడా ఈ చట్టంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ చట్టం ఎలా అమలు చేయబడుతుందో మేము నిశితంగా పరిశీలిస్తున్నామని స్టేట్ డిపార్ట్‌మెంట్ స్పోక్‌పర్సన్ రాయిటర్స్‌తో చెప్పారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మతపరమైన హింసను ఎదుర్కొంటూ భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, పార్సీలు, బౌద్ధులు ఇలా ముస్లిమేతర మతాల వారికి భారత పౌరసత్వాన్ని అందించేందుక సీఏఏ ఉద్దేశింపబడింది. డిసెంబర్ 31, 2014కి ముందు వచ్చిన వారికి ఈ చట్టం కింద పౌరసత్వం అందించనున్నారు. అయితే, ముస్లింలకు ఎందుకు ఈ చట్టాన్ని అమలు చేయరని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో, మూడు దేశాల్లో మైనారిటీలుగా ఉన్న వారు, అణిచివేతకు గురైన వారి కోసమే ఈ చట్టం తీసుకువచ్చామని అమిత్ షా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..