IT Jobs: భారతీయులకు అనుకూలంగా మా ఉద్యోగాలు తీసేశారు.. అమెరికన్ టెక్కీల ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Jobs: H-1B వీసాలపై ఉన్న భారతీయ ఉద్యోగుల కోసం తమను ఉద్యోగాల నుంచి తొలగించినట్లు అమెరికన్ టెక్కీలు ఆరోపించడం సంచలనంగా మారింది. 20 మంది ఉద్యోగులను జాతి, వయస్సు వివక్ష ఆధారంగా తొలగించినట్లు వారు ఆరోపిస్తు్న్నారు. యూఎస్‌లో పనిచేస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్) ఈ ఆరోపణల్ని ఎదుర్కొంటోంది. ఈ విషయానని ది వాల్ స్ట్రీట్ జర్నల్(WSJ) నివేదించింది. H-1B వీసాలపై ఉన్న భారతదేశానికి చెందిన వర్కర్లకు అనుకూలంగా తమను తొలగించినట్లు అమెరికన్ ఉద్యోగులు ఆరోపించారు.
టీసీఎస్ నుంచి తొలగించబడిన వ్యక్తుల్లో కాకేసియన్స్, ఆసియన్-అమెరికన్లు, హిస్పానిక్ అమెరికన్లు ఉన్నారని, వీరంతా 40 నుంచి 60 ఏళ్లు కలిగిన వారని, వీరింతా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో నివసిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. వీరిలో అనేక మంది మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇతర అడ్వాన్సుడ్ డిగ్రీలను కలిగి ఉన్నట్లు తెలిపింది. తమ పట్ల వివక్ష చూపుతూ, హెచ్-1బీ వీసాలు ఉన్న భారతీయ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తూ భారతీయ ఐటీ దిగ్గజం చట్టాలను ఉల్లంఘిస్తోందని అమెరికన్ నిపుణులు ఆరోపిస్తున్నారు.
Also Read
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
Read Also: Alleti Maheshwar Reddy: కోమటి రెడ్డి లాంటి 5మంది మంత్రులు మాతో టచ్ లో ఉన్నారు
H-1B వీసా ప్రోగ్రామ్ యూఎస్ కంపెనీల్లో పనిచేసేందుక సాంకేతిక నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు అనుమతి ఇస్తుంది. సాధారణంగా హెచ్-1బీ వీసా కలిగిన వారు మూడు నుంచి ఆరేళ్ల పాటు ఉద్యోగంలో ఉంటారు, ఆ తర్వాత గ్రీన్ కార్డ్ పొందేందుకు, యూఎస్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయిన 22 మంది సమాన ఉపాధి అవకాశాల కమిషన్(ఈక్వల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ కమీషన్‘‘EEOC’’)కి ఫిర్యాదు చేశారు.
అయితే, ఈ ఆరోపణలు తప్పని తాము ఎప్పుడూ కూడా చట్టవిరుద్ధమైన వివక్షకి పాల్పడలేదని పేర్కొంది. యూఎస్‌లో సమాన అవకాశాలు కల్పించి సంస్థగా టీసీఎస్‌కి బలమైన రికార్డు ఉందని, దాని కార్యకలాపాల్లో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని కంపెనీ ప్రతినిధి చెప్పారు. ఒక్క టీసీఎస్ కాకుండా ఇన్ఫోసిస్, విప్రో వంటి భారత దిగ్గజ ఐటీ కంపెనీలు యూఎస్‌లో జాతి వివక్ష ఆరోపణలకు సంబంధించి చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
అమెరికన్లకు చెల్లించే డబ్బుతో పోలిస్తే, అంతే స్థాయి కలిగిన భారతీయ, ఇతర ఆసియా దేశాల ఉద్యోగులు తక్కువ జీతాలకు పనిచేస్తుండటంతో కంపెనీలు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు అమెరికన్లను కాదని వారిని నియమించుకుంటున్నాయి. మరోవైపు ఆర్థిక వ్యవస్థ మందగమనంతో ఐటీ ఇండస్ట్రీ సంక్షోభంలో ఉంది. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల్లోని పలు సంస్థలు ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించాయి.
తాజావార్తలు
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
-
Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
-
Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
-
OTR: ఉమ్మడి నల్గొండలో రెడ్డి ఆధిపత్యం? కాంగ్రెస్‌లో బీసీ నేతల అసంతృప్తి!
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?