Baltimore Bridge Collapse: అమెరికాలో బాల్టిమోర్ వంతెన కార్గో నౌక ఢీకొట్టడంతో కుప్పకూలింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. డాలీ అనే పేరుతో సింగపూర్ ఫ్లాగ్ ఉన్న షిప్ బాల్టిమోర్ నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు బయలుదేరిన కొద్ది సేపటికే ఇంజన్ వైఫల్యం ఎదురవ్వడంతో అదుపుతప్పి బ్రిడ్జ్ పిల్లర్‌ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బ్రిడ్జ్ కుప్పకూలడంతో పలువురు నీటిలో పడిపోయారు. ఈ షిప్ మొత్తం భారతీయ సిబ్బందితో నడపబడుతోంది.
Read Also: Israel: లెబనాన్‌పై ఇజ్రాయిల్ వైమానికి దాడి.. హిజ్బుల్లా కీలక కమాండర్ హతం..
అయితే, సకాలంలో నౌకా సిబ్బంది అధికారులను అప్రమత్తం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారతీయ సిబ్బందిని కొనియాడారు. వారిని హీరోలుగా ప్రశంసించారు. మేరీల్యాండ్ గవర్నర్ కూడా భారతీయ సిబ్బందిని అభినందించారు. వారు సకాలంలో ‘మేడే’ కాల్ పంపడంతో బ్రిడ్జ్‌పైకి వెళ్లే వాహనాలను అడ్డుకున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే బాల్టిమోర్‌లోని ఫ్రాన్సిస్ స్కాట్కీ బ్రిడ్జ్ కూలిపోయిన ఘటనను ఉద్దేశిస్తూ అమెరికాకు చెందిన ఓ వెబ్ కామిక్ భారతీయులను ఉద్దేశిస్తూ జాత్యాంహంకార కార్టూన్‌ని ప్రచురించింది. భారతీయులను అవమానించేలా చేసిన ఈ కార్టూన్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్ వేదికగా దీనికి సంబంధించిన కార్టూన్, వీడియోలో భారత సిబ్బంది ఇంగ్లీష్ భారతీయ యాసలో తిట్టుకుంటున్నట్లు ఆడియో కూడా ఉంది. ఈ గ్రాఫిక్ వీడియో వైరల్ గా మారింది. 4.2 మిలియన్ వ్యూస్, 2k కామెంట్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. పూజా సాంగ్వాన్ అనే యూజర్ ‘‘ విషాద సంఘటన సమయంలో భారతీయ సిబ్బందిని ఎగతాళి చేయడం సిగ్గు చేటు. గవర్నర్ స్వయంగా భారతీయ సిబ్బందిని ప్రశ్నించారు’’ అని అన్నారు.
It's shameful that people are mocking Indian Crew for the tragic incident…
Meanwhile the governor himself praised the crew👇🏻 https://t.co/bgkdACmwyL
— Pooja Sangwan Hooda 🇮🇳 (@ThePerilousGirl) March 27, 2024