China: చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేలా కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ట్రంప్ యూఎస్ అధ్యక్షుడిగా అధికారం చేపట్టే లోపే వాణిజ్య యుద్ధానికి చైనా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ సంస్థలపై ఆంక్షలను తీవ్రతరం చేయడం ద్వారా చైనా యూఎస్‌కి సవాల్ విసిరింది. ఒక వారం వ్యవధిలోనే చైనా ఈరోజు 10 యూఎస్ కంపెనీలపై సెకండ్ రౌండ్ ఆంక్షలను ప్రకటించింది. తైవాన్‌కి ఆయుధాలు అమ్మడం వల్లే చైనా, యూఎస్ కంపెనీలపై జరిమానాలు, ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
USA: అమెరికాలో న్యూ ఓర్లీన్స్‌లో ఉగ్ర ఘటన చోటు చేసుకుంది. న్యూ ఇయర్ రోజున జనంపైకి ఓ వ్యక్తి కారును పోనిచ్చాడు. పికప్ ట్రక్ జనాలపైకి దూసుకెళ్లడంతో పలువురు మరణించినట్లు తెలుస్తోంది. నిందితుడైన వ్యక్తి జనాలపైకి కాల్పులు జరిపినట్లు నివేదికలు వెలువడుతున్నాయి.
Cyberattack: తమ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌పై చైనా సైబర్ దాడులకు పాల్పడినట్లు గుర్తించామని అమెరికా ఆరోపించింది. వర్క్ స్టేషన్లలో ఉన్న కీలకమైన పత్రాలను దొంగిలించేందుకు యత్నించినట్లు పేర్కొనింది.
Joe Biden: మరికొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుఫున ట్రంప్ ఘన విజయం సాధించారు. ట్రంప్‌కి వ్యతిరేకంగా నిలబడిన డెమొక్రాట్ అభ్యర్థి, ఉపఅధ్యక్షురాలు కమలా హారిస్ ఓడిపోయారు. నిజానికి ముందుగా ట్రంప్‌కి పోటీగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ని అనుకున్నప్పటికీ, డెమొక్రటిక్ పార్టీ పట్టుబట్టీ మరి కమలా హారిస్‌కి అధ్యక్ష అభ్యర్థిత్వం ఇచ్చింది.
USA- Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై దాడులు కొనసాగుతుండటంతో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌తో యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ మాట్లాడినట్లు పేర్కొనింది.
హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌పై క్షిపణులతో దాడి చేసింది. అయితే, దీనికి అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. యెమెన్ రాజధానిలో ఉన్న హౌతీల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు అగ్రరాజ్యం వెల్లడించింది.
తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌లో ‘‘ మన చమురు, గ్యాస్‌ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ద్వారా అమెరికా వారితో విపరీతమైన లోటును భర్తీ చేయాలని యూరోపయిన్ యూనియన్‌కి చెప్పాను. లేకపోతే అన్ని విధాలుగా టారిఫ్‌లు ఉంటాయి’’ అని హెచ్చరించారు.
Govt Shutdown: షట్‌డౌన్ ప్రమాదం నుంచి అగ్రరాజ్యం అమెరికా గట్టెక్కినట్లే కనబడుతుంది. డొనాల్డ్ ట్రంప్ డిమాండ్లతో నిలిచిపోయిన కీలక నిధుల బిల్లును ప్రతినిధుల సభ లాస్ట్ మినిట్ లో ఆమోదించింది.