USA: అమెరికాలో న్యూ ఓర్లీన్స్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. న్యూ ఇయర్ రోజున జనంపైకి ఓ వ్యక్తి కారును పోనిచ్చాడు. పికప్ ట్రక్ జనాలపైకి దూసుకెళ్లడంతో పలువురు మరణించినట్లు తెలుస్తోంది. నిందితుడైన వ్యక్తి జనాలపైకి కాల్పులు జరిపినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. బోర్బన్ స్ట్రీట్, ఐబెర్‌విల్లే కూడలిలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న జనాలపైకి ట్రక్ దూసుకెళ్లింది. ఈ సంఘటన తెల్లవారుజామున 3:15 గంటల ప్రాంతంలో జరిగింది. బాధితుల సంఖ్యను ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ ఘటనలో 10 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. 30 మంది వరకు గాయపడినట్లు సమాచారం.
Read Also: GST Collections: 2024లో జీఎస్‌టీ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా?
ఇటీవల జర్మనీలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న ప్రజలపైకి ఇలాగే కార్ దూసుకెళ్లింది. జర్మనీలోని మాగ్డెన్‌బర్గ్2లో ఘటన చోటు చేసుకుంది. ఐదుగురు మరణించగా, 200 మందికి పైగా ప్రజలు గాయాలు పాలయ్యారు.సౌదీకి చెందిన ఓ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.