Cyberattack: తమ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌పై చైనా సైబర్ దాడులకు పాల్పడినట్లు గుర్తించామని అమెరికా ఆరోపించింది. వర్క్ స్టేషన్లలో ఉన్న కీలకమైన పత్రాలను దొంగిలించేందుకు యత్నించినట్లు పేర్కొనింది. కాంగ్రెస్‌కు రాసిన లేఖలో ఈ విషయాలను వాషింగ్టన్ వెల్లడించింది. అయితే, డిసెంబర్ ప్రారంభంలో ఈ సైబర్ దాడి జరిగినట్లు తేలిపింది. థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్ బియాండ్ ట్రస్ట్ నెట్‌వర్క్ లోపాలను ఉపయోగించుకుని హ్యాకర్లు వర్క్‌స్టేషన్లు, కీలకమైన పత్రాలను యాక్సెస్ చేసినట్లు చెప్పుకొచ్చింది. డిసెంబర్ 8వ తేదీన బియాండ్ ట్రస్ట్ అప్రమత్తమై ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చిందని యూఎస్ ట్రెజరీ విభాగం అధికారి చెప్పుకొచ్చారు. అనంతరం సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ, ఎఫ్‌బీఐ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
Read Also: South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడికి షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్ట్
అయితే, దీనిపై ఎఫ్‌బీఐ అధికారులు ఇంకా రియాక్ట్ కాలేదు. కాగా, వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. మాపై అమెరికా చేస్తున్న ఆరోపణలను గట్టిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పుకొచ్చింది. మరోవైపు జార్జియాలోని బియాండ్ ట్రస్ట్ సైతం ఈ సైబర్ దాడిపై రియాక్ట్ కాలేదు. వారి వెబ్‌సైట్‌లో.. ఇటీవల తమ కస్టమర్ల భద్రత ముప్పు వాటిల్లిందని పేర్కొనింది. దీనిపై విచారణ కొనసాగుతుందని తెలిపింది. బియాండ్ ట్రస్ట్ తెలిపిన భద్రతా సంఘటన ట్రెజరీ నివేదించిన హ్యాకింగ్ ఘటనకు దగ్గరగా ఉందని గుర్తించాం. అయినా ఈ ఘటనపై విచారణ జరగాలని సైబర్ సెక్యూరిటీ కంపెనీ అధికారి చెప్పారు.