Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ తన చివరి సమయంలో తీసుకుంటున్న అధికారిక నిర్ణయాలతో పరిపాలనను, అధికార బదిలీని కష్టతరం చేస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. తాను అధికారం తీసుకోవడానికి ముందే ఎన్ని కష్టతరమైన మార్పులు సాధ్యమో అన్నీ చేస్తున్నారని విమర్శించారు. న్యాయవ్యవస్థలో ఇలా జరగడం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. అర్థంలేని పరిపాలనా ఉత్తర్వులు ఇచ్చి గ్రీన్ న్యూ స్కామ్, ఇతర రకాలుగా డబ్బును వృథా చేస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు. ఈ ఉత్తర్వులతో అమెరికా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. తాను అధికారంలోకి రాగానే వాటిని తొలగిస్తానని హామీ ఇచ్చారు. తన పాలనలో యూఎస్ ను మరింత శక్తివంతమైన దేశంగా నిలబెడతానని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
Read Also: Formula E Car Race Case : కేటీఆర్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ.. దూకుడు పెంచిన ఏసీబీ
అయితే, తాము ఇప్పటికే రూపొందించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ ద్వారా ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నాడు. ఇక, యూఎస్ తీర ప్రాంతంలో చమురు, సహజ వాయువు కోసం చేసే డ్రిల్లింగ్‌ను జో బైడెన్ నిషేధించాడు.. ఒరెగాన్, మెక్సికో, కాలిఫోర్నియా మొదలైన ప్రదేశాల్లో 625 మిలియన్ ఎకరాల తీర ప్రాంతంలో ఆయిల్, గ్యాస్ డ్రిల్లింగ్‌లు చేపట్టకుండా తగిన చర్యలు తీసుకుంటాం.. దేశీయ ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహిస్తామని ప్రమాణస్వీకారం చేయడానికి కొద్ది రోజుల డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేశాడు.