Donald Trump: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హమాస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. తాను అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు చేపట్టకముందే హమాస్ చెరలో ఉన్న బందీలను రిలీజ్ చేయాలి.. అలా జరగకపోతే మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు నరకం చూపిస్తానని అతడు హెచ్చరించారు. చరిత్రలో ఎప్పుడూ చూడని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నాడు. తక్షణమే బందీలను విడుదల చేయండి అని సూచించాడు. గతంలో ఏం జరిగింది అనే దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడను.. ఇప్పుడు జరగాల్సిందాని గురించి ఆలోచించాలని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.
Read Also: AFI President: ఏఎఫ్‌ఐ అధ్యక్షుడిగా బహదూర్‌సింగ్!
ఇక, నేను రేపు ఖతార్ రాజధాని దోహాకు వెళ్తున్నాను అని అమెరికాకు కాబోయే అధినేత డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నాడు. అక్కడ, పలు అంశాలపై పురోగతి లభిస్తుందని అనుకుంటున్నాను చెప్పుకొచ్చారు. అయితే, అంతకుముందు, ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ మిలిటరీ విభాగమైన అల్ కస్సామ్ బ్రిగేడ్ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అందులో అమెరికా- ఇజ్రాయెల్ జాతీయుడైన ఎడాన్ అలెగ్జాండర్ మాట్లాడుతూ.. నేను గత 420 రోజులుగా హమాస్ చెరలో బందీగా కొనసాగుతున్నట్లు తెలిపాడు. మేమంతా భయంతో రోజుకు వెయ్యిసార్లు చస్తున్నామని వాపోయాడు. మమ్మల్ని త్వరగా విడిపించండి అంటూ అభ్యర్థించాడు.. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.