Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఓడిపోయారు. ఈ క్రమంలో తాజాగా 119వ కాంగ్రెస్ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన విధేయత ప్రతిజ్ఞలో ఆమె తడబడ్డారు. ఆ ప్రతిజ్ఞలో నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జెండాకు విధేయత చూపుతాను అని అభ్యర్థులు చెప్పాలి.. అయితే, హారిస్ మాత్రం జెండాను విస్మరించి ప్రతిజ్ఞ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఆమె తీరుపై పెద్ద ఎత్తున నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Also: Britain PM vs Elon Musk: బ్రిటన్ ప్రధానిపై ఎలాన్ మస్క్ తీవ్ర ఆరోపణలు.. కీర్ స్టార్మర్ కౌంటర్..
కాగా, కమలా హారిస్ విధేయత ప్రతిజ్ఞను సలాడ్ చేసేశారని ఒకరు వ్యాఖ్యనించగా.. సెనెట్ ఫ్లోర్‌లో విధేయత ప్రతిజ్ఞను తప్పుగా పలికి హారిస్ మన దేశాన్ని అవమానించారు అంటూ మరొకరు నెట్టింట రాసుకొచ్చారు. దేశ చరిత్రలో అత్యల్ప ఐక్యూ కలిగిన అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ అని మరో నెటిజన్ విమర్శలు గుప్పించారు. ఇదిలాఉండగా.. హారిస్‌కు సంబంధించిన మరో వీడియో సైతం ప్రస్తుతం వైరల్ అవుతుంది. అందులో సెనెట్‌లో కొత్తగా ఎన్నికైన సభ్యులతో కమలా హారిస్ ప్రతిజ్ఞ చేయిస్తున్న సమయంలో అక్కడే ఉన్న అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇతర సభ్యులతో కలిసి నవ్వుతూ కనపడ్డారు. ఈ సందర్భంగా అధ్యక్ష ఎన్నికల్లో హారిస్ ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అమెరికా ఓ బుల్లెట్‌ను తప్పించుకుందని కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం మాజీ సహాయకుడు చెస్టర్ టామ్ కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Kamala Harris swears in 6 Republican Senators and 6 Democrat Senators.
JD Vance all smiles. pic.twitter.com/cCFgszq2Ew— SweetPeaBelle (@SweetPeaBell326) January 3, 2025
Kamala just completely messed up the Pledge of Allegiance on the Senate floor.
pic.twitter.com/eoCqa1wdat— Benny Johnson (@bennyjohnson) January 3, 2025