Greenland: మరికొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతోన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన పనామా కాలువు, కెనడా, గ్రీన్‌ల్యాండ్ ప్రకటనలు సంచలనంగా మారాయి. గ్రీన్‌ల్యాండ్‌ని కొనేందుకు ట్రంప్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తర అమెరికా, రష్యా మధ్య ఆర్కిటిక్ ప్రాంతంలో, యూరప్‌కి వాయువ్యంగా ఉన్న వ్యూహాత్మకంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారు.
Justin Trudeau: అమెరికా, కెనడా మధ్య ట్రంప్ వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. కెనడా అమెరికాలో ‘‘51వ రాష్ట్రం’’గా మారాలని ఆయన కోరారు. ఇలా చేస్తే, అధిక సుంకాలు, భద్రత ఇబ్బందులు ఉండవని, చైనా-రష్యాల నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పారు.
Donald Trump: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి భారీ షాక్ తగిలింది. హష్ మనీ కేసులో ట్రంప్‌కు ఈరోజు (జనవరి 10) శిక్ష విధిస్తామని ఇప్పటికే న్యూయార్క్ కోర్టు జడ్జి జువాన్ మెర్చాన్ స్పష్టం చేశారు.
USA: విమానంలో ప్రియురాలిలో గొడవ, ఇతర ప్రయాణికులకు ప్రమాదంగా మారింది. అమెరికాలోని బోలోని లోగాన్ విమానాశ్రయంలో విమానం టాక్సీ వేలో ప్రయత్నిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఫ్లైట్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేశాడు. మంగళవారం ఈ ఘటన జరిగింది. బెట్‌బ్లూ విమానంలో ఈ ఘటన జరిగింది. నిందితుడిని ప్యూర్టోరికన్ ప్రయాణికుడిగా గుర్తించారు. తన ప్రియురాలిలో వాగ్వాదం తర్వాత విమానం నుంచి దూకేందుకు అతను ప్రయత్నించాడు.
డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హమాస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. తాను అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు చేపట్టకముందే హమాస్ చెరలో ఉన్న బందీలను రిలీజ్ చేయాలి.. అలా జరగకపోతే మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు నరకం చూపిస్తానని అతడు హెచ్చరించారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ తన చివరి సమయంలో తీసుకుంటున్న అధికారిక నిర్ణయాలతో పరిపాలనను, అధికార బదిలీని కష్టతరం చేస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.
Bird Flu: అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ మరణం తీవ్ర కలకలం రేపుతుంది. లూసియానాలో ఓ వ్యక్తికి బర్డ్‌ఫ్లూ సోకి చనిపోయినట్లు అక్కడి వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
తాజాగా 119వ కాంగ్రెస్ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన విధేయత ప్రతిజ్ఞలో ఆమె తడబడ్డారు. హారిస్ విధేయత ప్రతిజ్ఞను సలాడ్ చేసేశారని ఒకరు వ్యాఖ్యనించగా.. సెనెట్ ఫ్లోర్లో విధేయత ప్రతిజ్ఞను తప్పుగా పలికి హారిస్ మన దేశాన్ని అవమానించారు అంటూ మరొకరు నెట్టింట రాసుకొచ్చారు.
Plane Crash : అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ చిన్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు. సమాచారం ప్రకారం, ఈ విమానం గిడ్డంగిపై పడిపోయింది.
Adani bribery case: సోలార్ ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చిందని అమెరికా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో కీలక పరిణామం ఎదురైంది. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఇతరులపై కొనసాగుతున్న మూడు కేసులను కలుపుతూ న్యూయార్క్ కోర్టు ఆదేశించింది. ఈ కేసులను ఉమ్మడి విచారణలో కలిపి విచారించాలని కోర్టు తీర్పు చెప్పింది.