అమెరికాలో విమాన ప్రమాదం జరిగింది. టెక్సాస్లోని విక్టోరియా హైవేపై విమానం కూలిపోయింది. పలు కార్లను ఢీకొట్టి ముక్కలైపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను చక్కదిద్దారు.
సిరియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని తిరుగుబాటు దళాలు బెదిరిస్తున్న వివాదంలో అమెరికా జోక్యం చేసుకోకూడదని డొనాల్డ్ ట్రంప్ శనివారం అన్నారు.
Small Vehicles: భారత్లో ప్రతి ఒక్కరూ తమకు సొంత కారు కలిగి ఉండాలని అనుకుంటున్నారు. ఈ కారణంతోనే సరసమైన ధరల్లో ఉన్న చిన్న కార్లకు ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. ఈ డిమాండ్ 2025లో మరింత ఎక్కువగా ఉండబోతుందని గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ 'నోమురా' తన రిపోర్టులో వెల్లడించింది.
అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయుల భద్రత ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి వరుసగా భారతీయుల హతం అవుతున్నారు. ఆ మధ్య హైదరాబాద్కు చెందిన విద్యార్థిని దుండగులు కిడ్నాప్ చేసి హతమార్చారు.
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సమీప బంధువు సాగర్ అదానీలపై యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) నోటీసు (సమన్లు) జారీ చేసింది. ఇందులో 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఇరువురిని ఆదేశించింది. సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ పొందడానికి 265 మిలియన్ డాలర్లు (రూ. 2200 కోట్లకు పైగా) లంచం ఇచ్చారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే.
దేశీయ స్టాక్ మార్కె్ట్కు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు ముందు సరికొత్త జోష్ వచ్చింది. గత ఐదు నెలల్లో ఎన్నడూ చూడని విధంగా సూచీలు రాకెట్లా దూసుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్కు బాగా కలిసొచ్చాయి.
ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యాపై అమెరికా తయారీ క్షిపణులను ఉక్రెయిన్ ప్రయోగించింది. దీంతో రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఆయన ఇప్పటి నుంచే ప్రభుత్వ కూర్పు చేసుకుంటున్నారు.
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో అరెస్టయ్యాడు. నివేదికల ప్రకారం.. అన్మోల్ను కాలిఫోర్నియాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికన్ అధికారులు కొంతకాలం క్రితం అన్మోల్ తమ దేశంలో ఉన్నాడని సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో.. ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ యూనిట్ అతని అప్పగింత ప్రక్రియను ప్రారంభించిన వారాల తర్వాత కాలిఫోర్నియా పోలీసులు అన్మోల్ను అరెస్టు చేశారు.