Israel-Gaza: గాజా సహాయ కేంద్రం దగ్గర కాల్పులు.. 31 మంది మృతి
- గాజా సహాయ కేంద్రం దగ్గర కాల్పులు
- 31 మంది మృతి.. 80 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజాలోని సహాయ కేంద్రం దగ్గర జరిగిన కాల్పుల్లో 31 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 80 మంది గాయపడ్డారు. ఆకలితో అలమిటిస్తున్న అమాయక ప్రజలను ఇజ్రాయెల్ ఊచకోత కోసిందని హమాస్ ఆరోపించింది. ఆ సహాయ కేంద్రాలు మానవతా సహాయ కేంద్రాలు కాదని.. సామూహిక ఊచకోతలు అని హమాస్ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Ileana : మళ్లీ రీఎంట్రీ ఇస్తా అంటున్న గోవా బ్యూటీ..
Also Read
ఆదివారం దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంలో అమెరికా, ఇజ్రాయెల్ మద్దతు ఉన్న గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (జీహెచ్‌ఎఫ్) పంపిణీ కేంద్రం దగ్గర ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడి ఉన్నారు. పంపిణీ చేస్తున్న సాయాన్ని ప్రజలు అందుకుంటున్నారు. ఒక్కసారిగా కాల్పులు జరగడంతో అక్కడికక్కడే 31 మంది పాలస్తీనియర్లు ప్రాణాలు కోల్పోయారు. 80 మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ ట్యాంకులు.. ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిందని ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Alluri Seetharamaraju: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. పెళ్లి బృందం ప్రాణాలు కాపాడిన బండరాయి
అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వర్గాలు ఖండించాయి. అలాగే ఇజ్రాయెల్ మాజీ ప్రధాన మంత్రి నఫ్తాలి బెన్నెట్ కూడా ఖండించారు. ప్రపంచ మీడియా పెద్ద అబద్ధాన్ని క్రియేట్ చేసిందని పేర్కొన్నారు. అలాంటి కాల్పులు ఏం జరగలేదని.. అదంతా కేవలం అబద్ధమని తెలిపారు. గాజాలో తమ సహాయ పంపిణీకి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిందని జీహెచ్‌ఎఫ్ తెలిపింది. పౌరులపై దాడి జరిగిందన్న హమాస్ ఆరోపణలను ఖండించింది.
ఇజ్రాయెల్, అమెరికా మద్దతు ఉన్న ప్రైవేటు సంస్థ జీహెచ్‌ఎఫ్ మే 26 నుంచి గాజాలో ఆహారాన్ని పంపిణీ చేస్తోంది. అయితే జీహెచ్‌ఎఫ్.. ఇజ్రాయెల్ కోసం పని చేస్తోందని.. జనాలను గుమిగూడేలా చేసి అనంతరం కాల్పులు జరిగేలా ప్లాన్ చేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఐక్యరాజ్యసమితి.. జీహెచ్‌ఎస్ యంత్రాంగంపై విమర్శలు గుప్పించింది. మానవతా సూత్రాలను జీహెచ్‌ఎఫ్ ఉల్లంఘిస్తోందని.. పాలస్తీనియన్లకు ప్రమాదాలను సృష్టిస్తోందని ఐక్యరాజ్యసమితి ఆరోపించింది. ఇజ్రాయెల్ లక్ష్యాలను తీర్చడానికే జీహెచ్‌ఎఫ్ పని చేస్తోందని పెద్ద ఎత్తున ఇతర సంస్థల నుంచి కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణపై హమాస్‌తో చర్చలు జరుపుతోంది. అయితే ఈ చర్చలు కొలిక్కి రాలేనట్లుగా తెలుస్తోంది. పూర్తిగా ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చేయాలని హమాస్ పట్టుబడుతోంది. అయితే చర్చలు అసంపూర్తినే ముగిశాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!