Pakistan Cricket: కోచ్ టార్గెట్‌గా పాకిస్తాన్ క్రికెట్‌లో తిరుగుబాటు..
- టీ20 వరల్డ్ కప్‌లో పాక్ ఘోర వైఫల్యం..
- కోచ్‌పై ఆటగాళ్ల తిరుగుబాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Cricket: T20 ప్రపంచ కప్‌లో ఘోర పరాజయాలు పాకిస్తాన్ క్రికెట్‌లో సంక్షోభానికి కారణమవుతున్నాయి. భారత్‌పై ఓడిపోవడమే కాకుండా, సెమీస్‌కు క్వాలిఫై అవ్వకపోవడంపై పాక్ మాజీలు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, టీమ్ సభ్యులపై విరుచుకుపడుతున్నారు. పాక్ క్రికెటర్ల పేలవమైన ఆటతీరుకు గానూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) భారీ జరిమానాను వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కెప్టెన్‌ను తొలగించవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
Read Also: AP Crime: పేకాటలో బాకీ వివాదం.. స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు..
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
పాక్ ఘోర ఆటతీరు, పరాజయాలకు కోచ్ మైక్ హెస్సెన్‌పై మాజీలు విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఆటగాళ్లు కోచ్‌పై తిరుగుబాటు చేస్తున్నారని తెలుస్తోంది. టోర్నమెంట్ సమయంలో కోచ్ ప్రవర్తనపై ఆటగాళ్లు వ్యక్తిగతంగా పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారని అక్కడి మీడియా చెబుతోంది. అతడి కఠినమైన విధానాలు, సంప్రదింపులు లేకుండా తీసుకున్న నిర్ణయాలు డ్రెస్సింగ్ రూంలో వాతావరణాన్ని దెబ్బతీశాయని ఆరోపిస్తున్నారు. కెప్టెన్‌ను సంప్రదించకుండానే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని, హెస్సెన్ తరుచుగా జట్టు నిర్వహణ అంశాల్లో జోక్యం చేసుకుంటున్నారని కూడా పేర్కొన్నారు.
సీనియర్ అధికారులు ప్రస్తుతం కోచ్ హెస్సెన్ ప్రవర్తనపై సమీక్షిస్తున్నారు. కోచ్‌తో వివరణాత్మక చర్చలు జరిపే ముందు టూర్ నివేదికను పరిశీలించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ ప్యానెల్, కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఇద్దరూ హెస్సెన్ అధికారాన్ని సవాలు చేయలేకపోయారని, కోచ్ జట్టు వ్యవహారాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నారని తెలుస్తోంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో హెస్సెన్ ను పీసీబీ తొలగించకపోవచ్చు. అతడితో పీసీబీకి 2 ఏళ్ల ఒప్పందం ఉంది.
తాజావార్తలు
-
Poco X8s: 12GB RAM, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో Poco X8s? లీకైన వివరాలు ఇవే!
-
Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
-
Ferrari Luce: భారత్‌లోకి ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. 2.5 సెకన్లలో 100 km/h స్పీడ్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!