US: అమెరికాలో ఫైర్ బాంబ్ దాడి.. పలువురికి గాయాలు.. నిందితుడు పాలస్తీనా నినాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి ఇజ్రాయెల్ వ్యతిరేకంగా బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ సందర్భంగా నిందితుడు పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేశాడు. పాలస్తీనాను విడిపించాలని డిమాండ్ చేశాడు.
ఇది కూడా చదవండి: Vidya Balan : ఇండస్ట్రీలో అలా అయితేనే కెరీర్ ఉంటుంది..
Also Read
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
బౌల్డర్ నగరంలో ఒక వ్యక్తి ఇంట్లో తయారు చేసిన మోలోటోవ్ కాక్‌టెయిల్ బాంబును విసిరాడు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వెంటనే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడు పాలస్తీనాను విడిపించాలని డిమాండ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలో నిందితుడు చొక్కా లేకుండా చేతుల్లో సీసాలు పట్టుకుని ఉన్నాడు. గడ్డి కాలిపోవడంతో వేగంగా నడుస్తున్నట్టు కనిపించాడు.
ఇది కూడా చదవండి: JEE Advanced 2025 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. స్కోర్‌కార్డ్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఇక ఈ ఘటనను ఎఫ్‌బీఐ డైరెక్టర్ ఉగ్ర దాడిగా అభివర్ణించారు. యూదులు లక్ష్యంగా ఈ దాడి జరిగిందని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ పేర్కొ్న్నారు. ఈ సంఘటన గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సమాచారం అందించినట్లు వైట్ హౌస్ తెలిపింది. ఇక ఈ సంఘటనపై ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హమాస్ చెరలో ఉన్న బందీలను తీసుకురావాలని యూదులు కవాతు చేస్తుండగా ఈ దాడి చేయడం దారుణం అన్నారు. ఇక అమెరికాలో ఉగ్రవాదానికి స్థానం లేదని రూబియో అన్నారు.
ఇటీవల వాషింగ్టన్‌లో యూదు మ్యూజియం వెలుపల ఇద్దరు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సిబ్బందిపై కాల్పులకు తెగబడగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుండగా ఈ ఘటన జరిగింది. అప్పుడు కూడా నిందితుడు పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేశాడు. 31 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
Pro-Hamas supporters should be categorized as domestic terrorists!! pic.twitter.com/cNLWq42Swm
— Jammles (@jammles9) June 1, 2025
తాజావార్తలు
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!