America : అమెరికాలో (యుఎస్) భారతీయ పౌరుడు అయిన సాయి కందుల వైట్ హౌస్ పై దాడి చేసినందుకు ఎనిమిదేళ్లు జైలు శిక్ష విధించబడింది. నిందితుడు కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిచెల్ దంపతులు విడిపోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ సాగుతోంది. ఇద్దరూ కూడా గత కొంత కాలంగా విడివిడిగా ఉంటున్నారని సమాచారం.
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వాషింగ్టన్ నేషనల్ కేథడ్రల్ చర్చిలో జరిగిన ప్రార్థనా కార్యక్రమాల్లో అధ్యక్షుడు బైడెన్ దంపతుల సహా.. కాబోయే అధ్యక్షుడు ట్రంప్ దంపతులు, మాజీ అధ్యక్షుల కుటుంబాలు హాజరయ్యారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండేళ్లకు పైగా యుద్ధం సాగుతోంది. ఇప్పటికీ రెండు దేశాల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. రష్యా జరిపిన భీకరదాడుల్లో ఉక్రెయిన్ చాలా నష్టపోయింది. తాజాగా ఉక్రెయిన్ కూడా అంతే ధీటుగా దాడులను ఎదుర్కొంటోంది.
అగ్ర రాజ్యం అమెరికాలో నూతన సంవత్సరం రోజున జరిగిన ఉగ్ర దాడిని ప్రధాని మోడీ ఖండించారు. న్యూ ఓర్లీన్స్లో ఒక పికప్ ట్రక్కు అత్యంత వేగంగా జనాలపైకి దూసుకొచ్చింది.
అమెరికా వీసాల్లో రికార్డ్ సృష్టించింది. వరుసగా రెండో ఏడాది 10 లక్షలకు పైగా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను జారీ చేసినట్లు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.
సిరియాలో కారు బాంబు దాడి బీభత్సం సృష్టించింది. ఉత్తర సిరియాలోని టర్కీ మద్దతుగల సిరియన్ నేషనల్ ఆర్మీ నియంత్రణలో ఉన్న మన్బిజ్ నగరంలో కారు బాంబు దాడి జరిగింది.
అమెరికాలోని జార్జియాలో స్వలింగ సంపర్కుల జంటకు కోర్టు శిక్ష విధించింది. తమ దత్తపుత్రులను లైంగికంగా వేధించిన కేసులో దోషిగా తేలిన ఓ 'గే జంట'కు 100 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇద్దరు ముద్దాయిలు విలియం డేల్ జుల్లాక్, జాచరీ జుల్లాక్లకు శిక్ష విధించినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.