Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ట్రంప్ సర్కార్ తీసుకువచ్చిన ‘‘బిగ్, బ్యూటిపుల్ బిల్’’పై ఇరువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ట్రంప్ ఎలాన్ మస్క్‌కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వివాదాస్పద బిల్లుకు ఓటు వేసే రిపబ్లిక్లను శిక్షించడానికి ప్రయత్నిస్తే ‘‘తీవ్ర పరిణామాలు’’ ఎదుర్కోవాల్సి ఉంటుందని శనివారం బెదిరించారు.
“వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు”పై ఎలోన్ మస్క్ తీవ్ర విమర్శలు చేయడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాశ వ్యక్తం చేశారు. EVలకు ఫెడరల్ కన్స్యూమర్ టాక్స్ క్రెడిట్‌ను దశలవారీగా తొలగించాలనే ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ ప్రణాళిక నుంచి మస్క్ వ్యతిరేకత వచ్చిందని, ఇది టెస్లాను నేరుగా ప్రభావితం చేస్తుందని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఎలోన్, నేను చాలా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాము. Also Read:TG Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక…
US China Trade War: అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వారం చివరలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్ చర్చిస్తారని వైట్‌హౌజ్ సోమవారం తెలిపింది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసిద్ధ ‘‘హార్వర్డ్ యూనివర్సిటీ’’కి బిగ్ షాక్ ఇచ్చాడు. హార్వర్డ్‌కి ‘‘పన్ను మినహాయింపు’’ హోదాని రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ‘‘క్యాంపస్ యాక్టివిజం’’పై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఆగ్రహంతో ఉంది. గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా ఈ క్యాంపస్ యాక్టవిజం, లెఫ్టిస్ట్ భావజాలంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతానని చెప్పారు.
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కాష్ పటేల్ ను ఆల్కహాల్, పొగాకు, తుపాకీలు, పేలుడు పదార్థాల బ్యూరో (ATF) యాక్టింగ్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో అమెరికా ఆర్మీ కార్యదర్శి డేనియల్ డ్రిస్కాల్ నియమితులయ్యారు. డ్రిస్కాల్ ఆర్మీ కార్యదర్శిగా కొనసాగుతారని, అదే సమయంలో అమెరికా న్యాయ శాఖకు చెందిన ఏటీఎఫ్ శాఖను కూడా పర్యవేక్షిస్తారని వర్గాలు తెలిపాయి. ఎఫ్బీఐ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే, ఫిబ్రవరి చివరలో పటేల్ తాత్కాలిక…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. అధికారం చేపట్టిన నాటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్తున్నారు. వలసలను కఠినతరం చేస్తూ.. పలు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ సంచలనంగా మారారు. తాజాగా యూఎస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విద్యా శాఖను రద్దు చేస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. వైట్ హౌస్ తూర్పు గదిలోని డెస్క్‌ల వద్ద కూర్చున్న పాఠశాల పిల్లలతో ఒక ప్రత్యేక…
Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు తీసుకున్నారు. వచ్చీ రాగానే ఆయన గత పాలకుడు జో బైడెన్ నిర్ణయాలను రద్దు చేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇదిలా ఉంటే, తన ఎన్నికల హామీల్లో కీలకమైన ‘‘బర్త్ రైట్ పౌరసత్వం’’ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. దీంతో ముఖ్యంగా విదేశాల నుంచి అమెరికా వెళ్లిన వారికి భారీ షాక్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా భారతీయ వలసదారులకు ఈ పరిణామం మింగుడుపడటం…
US Teacher: అమెరికాకు చెందిన ఓ మహిళా ఉపాధ్యాయురాలు, తన స్టూడెంట్‌తోనే శృంగార సంబంధం పెట్టుకుంది. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న లారా కారన్, తన పూర్వ విద్యార్థుల్లో ఒకరితో సంబంధం పెట్టుకుంది. దీని ఫలితంగా ఓ బిడ్డను కూడా కలిగి ఉంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమెను అక్కడి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. 13 ఏళ్ల విద్యార్థితో బిడ్డను కలిగి ఉన్న నేరం కింద ఆమె అరెస్ట్ జరిగింది.
Justin Trudeau: అమెరికా, కెనడా మధ్య ట్రంప్ వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. కెనడా అమెరికాలో ‘‘51వ రాష్ట్రం’’గా మారాలని ఆయన కోరారు. ఇలా చేస్తే, అధిక సుంకాలు, భద్రత ఇబ్బందులు ఉండవని, చైనా-రష్యాల నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పారు.
Joe Biden: మరికొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుఫున ట్రంప్ ఘన విజయం సాధించారు. ట్రంప్‌కి వ్యతిరేకంగా నిలబడిన డెమొక్రాట్ అభ్యర్థి, ఉపఅధ్యక్షురాలు కమలా హారిస్ ఓడిపోయారు. నిజానికి ముందుగా ట్రంప్‌కి పోటీగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ని అనుకున్నప్పటికీ, డెమొక్రటిక్ పార్టీ పట్టుబట్టీ మరి కమలా హారిస్‌కి అధ్యక్ష అభ్యర్థిత్వం ఇచ్చింది.