Justin Trudeau: అమెరికా, కెనడా మధ్య ట్రంప్ వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. కెనడా అమెరికాలో ‘‘51వ రాష్ట్రం’’గా మారాలని ఆయన కోరారు. ఇలా చేస్తే, అధిక సుంకాలు, భద్రత ఇబ్బందులు ఉండవని, చైనా-రష్యాల నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పారు. గతంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ట్రంప్‌ని కలిసిన సందర్భంలో కూడా ట్రంప్ మాట్లాడుతూ.. కెనడా అమెరికాలో రాష్ట్రంగా మారాలని, గవర్నర్‌గా జస్టిన్ ట్రూడో ఉండాలని వ్యాఖ్యానించాడు. మరోవైపు కెనడా, అమెరికా మధ్య వాణిజ్య లోటు ఉందని, దీంతో కెనడా దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తానని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే, ట్రంప్ వ్యాఖ్యలపై జస్టిన్ ట్రూడో స్పందించారు. ఆయన వ్యాఖ్యల్ని తోసిపుచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలు దృష్టి మరల్చే వ్యూహంగా అభివర్ణించారు. ‘‘అది ఎప్పటిక జరగదు. కెనడా ప్రజలు కెనడియన్లుగా ఉండటం పట్ల చాలా గర్వంగా ఉన్నారు. మనల్ని మనం సులభంగా నిర్వచించుకునే మార్గల్లో ఒకటి. మనం అమెరికన్లం కాము’’ అని సీఎన్ఎన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉన్నారు.
Read Also: Steve Smith: ఒక్క పరుగుతో 10వేల మైలురాయి మిస్.. స్టీవ్ స్మిత్ ఏమన్నాడంటే?
కెనడా సరిహద్దు భద్రతను పెంచకపోతే అన్ని కెనడియన్ దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించాలని ట్రంప్ ఇటీవల సూచించారు, ఈ చర్య రెండు ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతుందని ట్రూడో హెచ్చరించారు. అటువంటి సుంకాలను అమలు చేస్తే పెరిగిన ధరల భారాన్ని అమెరికా వినియోగదారులు భరించాల్సి ఉంటుందని ట్రూడో అన్నారు. “ఈ సుంకాలను పెంచడంపై ఆయన ముందుకు వెళితే, చమురు, గ్యాస్, విద్యుత్, ఉక్కు, అల్యూమినియం, కలప, కాంక్రీటు ఇలా అమెరికన్ వినియోగదారులు కెనడా నుండి కొనుగోలు చేసే ప్రతిదీ అకస్మాత్తుగా చాలా ఖరీదైనదిగా మారబోతోంది” అని హెచ్చరించారు.
2018 వాణిజ్య వివాదంలో కెనడా గతంలో కౌంటర్ టారిఫ్‌ను ఉపయోగించిందని హీన్జ్ కెచప్, ప్లేయింగ్ కార్డ్‌లు, బోర్బన్ మరియు హార్లే-డేవిడ్సన్ మోటార్‌సైకిళ్ల వంటి అమెరికన్ వస్తువులను లక్ష్యంగా చేసుకున్నారని ట్రూడో గుర్తు చేశారు. కానీ మేము అలా చేయాలనుకోవడం లేదని, ఎందుకంటే కెనడియన్లకు ధరలను పెంచడం ఇష్టం లేదని, మా దగ్గరి వాణిజ్య భాగస్వామికి హాని కలిగిస్తుందని అన్నారు.