ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కాష్ పటేల్ ను ఆల్కహాల్, పొగాకు, తుపాకీలు, పేలుడు పదార్థాల బ్యూరో (ATF) యాక్టింగ్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో అమెరికా ఆర్మీ కార్యదర్శి డేనియల్ డ్రిస్కాల్ నియమితులయ్యారు. డ్రిస్కాల్ ఆర్మీ కార్యదర్శిగా కొనసాగుతారని, అదే సమయంలో అమెరికా న్యాయ శాఖకు చెందిన ఏటీఎఫ్ శాఖను కూడా పర్యవేక్షిస్తారని వర్గాలు తెలిపాయి. ఎఫ్బీఐ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే, ఫిబ్రవరి చివరలో పటేల్ తాత్కాలిక ఏటీఎఫ్ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
Also Read:Off The Record : నకిరేకల్ కారులో ఓవర్ లోడ్.. డ్రైవర్ సీటు కోసం తీవ్ర పోటీ
న్యాయ శాఖ అధికారి ఒకరు ఈ మార్పును ధృవీకరించారు. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ATFను US డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో విలీనం చేయాలా వద్దా అని న్యాయ శాఖ సీనియర్ అధికారులు ఆలోచిస్తున్న సమయంలో డైరెక్టర్ విషయంలో ఈ ఆకస్మిక మార్పు చోటుచేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారతీయ-అమెరికన్ కాష్ పటేల్ భగవద్గీతపై ప్రమాణం చేసి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా అధికారికంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.