US Teacher: అమెరికాకు చెందిన ఓ మహిళా ఉపాధ్యాయురాలు, తన స్టూడెంట్‌తోనే శృంగార సంబంధం పెట్టుకుంది. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న లారా కారన్, తన పూర్వ విద్యార్థుల్లో ఒకరితో సంబంధం పెట్టుకుంది. దీని ఫలితంగా ఓ బిడ్డను కూడా కలిగి ఉంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమెను అక్కడి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. 13 ఏళ్ల విద్యార్థితో బిడ్డను కలిగి ఉన్న నేరం కింద ఆమె అరెస్ట్ జరిగింది.
న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. న్యూజెర్సీ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న లారా కారన్, 2016-2020 మధ్య కాలంలో బాధిత విద్యార్థితో తన ఇంట్లో కలిసి నివసించింది. ఆ సమయంలోనే అతడితో టీచర్ అనుచిత లైంగిక సంబంధాన్ని పెట్టుకున్నట్లు కేప్ మే కౌంటీ కోర్టులో ఆరోపణలు నమోదయ్యాయి. కారన్, 5వ తరగతి క్లాసులు చెబుతున్న క్రమంలోనే విద్యార్థిని తొలిసారిగా కలిసింది. 2005లో జన్మించిన బాలుడు, అతడి కుటుంబం టీచర్‌తో సన్నిహితంగా ఉండే వారని, బాలుడి తల్లిదండ్రులు తమ కుమారుడు, కుమార్తెని కార్న్ ఇంట్లో కొన్ని సార్లు ఉండే వారని, ఆ తర్వాత 2016 నుంచి అక్కడే శాశ్వతంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.
Read Also: Director Bobby: ఇద్దరు హీరోలను లైన్ లో పెట్టిన డైరెక్టర్ బాబీ ?
ఆ సమయంలోనే కారన్ తన విద్యార్థితో లైంగిక సంబంధాన్ని పెట్టుకుందని, ఆ తర్వాత గర్భవతి అయిందని పోలీసులు తెలిపారు. 2019లో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. బిడ్డ జన్మించిన సమయంలో బాధిత విద్యార్థి వయసు 13 ఏళ్లు కాగా, కారన్ వయసు 28 ఏళ్లు. డిసెంబర్ నెలలో ఒక ఫేస్‌బుక్ ఫోస్టులో బాలుడికి, కారన్ కొడుకుకి పోలికలు ఉండటాన్ని బాలుడి తండ్రి గమనించాడు. దీంతో ఈ లైంగిక వేధింపుల గురించి తెలిసింది. బాలుడు, బాలుడి సోదరి కలిసి ఒక బెడ్రూంలో పడుకునేవారని, మేల్కొని చూసే సరికి బాలుడు, కారన్ బెడ్రూంలో ఉండేవాడని తెలిసింది. కారన్ తన సోదరుడికి 11 ఏళ్ల ఉన్నప్పటి నుంచి కలిసి పడుకోవడం ప్రారంభించిందని సోదరి పోలీసులకు చెప్పింది.
ప్రస్తుతం బాధిత బాలుడి వయసు 19 ఏళ్లు. కారన్‌లో లైంగిక సంబంధం, కారన్ బిడ్డకు తండ్రి ఇతడే అని తేలింది. కారన్‌ని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై తీవ్రమైన లైంగిక వేధింపులు, పిల్లల సంక్షేమానికి హాని కలిగించారనే అభియోగాలు మోపబడ్డాయి. ప్రస్తుతానికి, మిడిల్ టౌన్‌షిప్ స్కూల్ డిస్ట్రిక్ట్ కారన్‌ను వేతనంతో కూడిన అడ్మినిస్ట్రేటివ్ సెలవులో ఉంచింది. పాఠశాల దర్యాప్తుకు సహకరిస్తోంది.