ఉత్తరప్రదేశ్‌లో విమాన ప్రమాదం జరిగింది. భారత వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం ప్రయాగ్‌రాజ్‌లో కూలిపోయింది. బమ్రౌలికి చెందిన విమానం బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రయాగ్‌రాజ్‌లోని రాంబాగ్ ప్రాంతంలోని చెరువులో కూలిపోయింది. ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.
ఇది కూడా చదవండి: Madras High Court: ఉద్దేశపూర్వకంగానే సనాతన ధర్మంపై మాట్లాడారు.. ఉదయనిధి స్టాలిన్‌ను తప్పుపట్టిన కోర్టు
విమాన ప్రయాణ సమయంలో ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతోనే విమానం కూలిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే అత్యవసర పారాచూట్ ఉపయోగించడంతో పైలట్లు క్షేమంగా బయటపడ్డారు. విమానం కూలిపోవడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారు. విమానాన్ని బమ్రౌలి ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ ప్రవీణ్ అగర్వాల్, సునీల్ కుమార్ పాండే నడిపారు. ఇద్దరు అధికారుల పరిస్థితి నిలకడగా ఉందని డిఫెన్స్ ప్రో వింగ్ కమాండర్ దేబర్తో ధార్ అధికారికంగా ప్రకటించారు.
ఇక విమానం నీటిలో మునిగిపోతుండగా స్థానికులు ట్రైనీ పైలట్‌లను కాపాడారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం బురద నీటిలోంచి విమాన శకలాలను బయటకు తీస్తున్నారు.
ఈనెలలో ఇది రెండో ప్రమాదం ఇది. జనవరి 10న తొమ్మిది సీట్ల విమానం రూర్కెలా విమానాశ్రయానికి 15-20 దూరంలో బహిరంగ ప్రదేశంలో కూలిపోయింది. అందరూ క్షేమంగా బయటపడ్డారు.
VIDEO | Uttar Pradesh: A trainee aircraft has reportedly crashed into a water body in Prayagraj. Rescue operations underway. More details are awaited.#Prayagraj
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/r62ZjtoRhh
— Press Trust of India (@PTI_News) January 21, 2026