భార్యాభర్తలు అన్నాక సరసాలు.. సరదాలు ఉంటాయి. ఒకరినొకరు ఆట పట్టించుకోవడం. జోకులు వేసుకోవడం మొగుడు పెళ్లాల మధ్య కామన్‌గా జరుగుతుంటాయి. అంతమాత్రాన కోపం తెచ్చుకోకూడదు. అది కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలోనే ఉండాలి తప్ప శృతిమించకూడదు. లేదంటే లేనిపోని అనర్థాలకు దారి తీస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగింది. భార్యతో సరదాగా పరిహాసం ఆడితే.. దాన్ని సీరియస్‌గా తీసుకున్న అర్థాంగి తీవ్ర నిర్ణయాన్ని తీసుకుంది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు బంగారం, గోల్డ్ ధరలు ఇలా..!
రాహుల్ శ్రీవాస్తవ, తన్ను సింగ్ భార్యాభర్తలు. లక్నోలోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నారు. తన్ను సింగ్‌కు మోడలింగ్‌పై ఆసక్తి ఉంది. భర్త రాహుల్ శ్రీవాస్తవ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు సరదాగా తమాషాగా జోకులు వేసుకున్నారు. ఆ సమయంలో తన్ను సింగ్‌ను ‘కోతి’ అని పిలిచాడు. ఈ మాటతో తన్ను సింగ్ తీవ్ర మనస్తాపానికి గురైంది. లోలోపల కుమిలిపోయింది. భర్త పని మీద బయటకు వెళ్లి తిరిగి వచ్చాక డోర్ కొడుతుంటే ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కిటికీ బద్దలు కొట్టి చూడగా భార్య ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే మెయిన్ డోర్ పగుల గొట్టి రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. దీంతో కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇది కూడా చదవండి: Ajit Pawar Plane Crash: మహిళా పైలట్లపై అజిత్ పవార్ చేసిన పాత పోస్ట్ వైరల్
నాలుగేళ్ల క్రితం ఒక స్నేహితుడి సాయంతో రాహుల్ శ్రీవాస్తవ, తన్ను సింగ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు పిల్లలు లేరు. రాహుల్ వదిన అంజలి మాట్లాడుతూ.. తన్ను సింగ్‌కు మోడలింగ్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. గదిలో కూర్చున్నప్పుడు తమాషాగా ‘కోతి’ అని పిలవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని చెప్పింది.