UP: ప్రియుడ్ని పెట్టెలో దాచిన కోడలు.. అత్త ఏం చేసిందంటే..!
- ప్రియుడితో ఉండగా ఇంటికి వచ్చిన అత్త
- ట్రంకు పెట్టెలో దాచి పెట్టిన కోడలు
- 45 నిమిషాల తర్వాత పోలీసుల ఎంట్రీతో ఓపెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యాభర్తల సంబంధాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. క్షణిక సుఖం కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. సమాజం ఏమనుకుంటుందన్న ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలించింది. ఇంతలో అత్త గారు రావడంతో ఉక్కిరి బిక్కిరి అయింది. ఎన్ని డ్రామాలు ఆడినా.. స్కెచ్ ఫలించలేదు. చివరికి అడ్డంగా బుక్కైంది. అసలేమైందంటే..!
ఇది కూడా చదవండి: Phone Tapping Case: కేటీఆర్ విచారణపై స్పందించిన సిట్!
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
- Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
- Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దంపతులు నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం ఇంట్లో వాళ్లంతా పనుల కోసం బయటకు వెళ్లిపోయారు. అలా వెళ్లారో.. లేదో ప్రియురాలు ఇంటికి రావాలని ప్రియుడికి ఫోన్ చేసి కోరింది. ఏడు ఇళ్ల దూరంలో ఉన్న యువకుడు మధ్యాహ్నం సమయంలో ప్రేయసి ఇంటికి వచ్చాడు. పక్క భవనంలోనే నివసించే అత్తకు ఏదో శబ్దం వచ్చినట్లు అనిపించడంతో కోడలు దగ్గరకు వచ్చింది. తలుపు తీయమని అడిగితే కంగారు పడిపోయింది. చాలా సేపు తీయలేదు. ఇంతలో ప్రియుడిని ట్రంకు పెట్టెలో దాచి పెట్టేసింది.
కొద్దిసేపటి తర్వాత కోడలు తలుపు తీశాక.. అత్త ఇళ్లంతా వెతికింది. ఎక్కడా కనిపించలేదు. అయితే అప్పటికే 45 నిమిషాలు అవ్వడంతో ట్రంకు పెట్టెలో దాక్కుకున్న యువకుడికి ఊపిరాడక పెట్టెను తన్నడం ప్రారంభించాడు. అయితే పెట్టె తాళం తీయమని అత్తగారు అడిగితే తన బట్టలు ఉన్నాయని తీయనని చెప్పింది. ఇంతలోనే కోడలు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. వాళ్లు వెతికినా కనిపించలేదు.
అయినా కూడా పట్టువీడని విక్రమార్కుడిలా అత్తకు ఏ మాత్రం అనుమానం తగ్గలేదు. మొత్తానికి పోలీసులకు ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. పోలీసుల ఒత్తిడితో పెట్టె తెరవగానే చెమటలు పెట్టేసి నీరసంగా యువకుడు బయటకు వచ్చాడు. అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కోడలిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడంతో యువకుడితో పాటు ఆమెను కూడా పోలీసులు తీసుకెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: Jogi Ramesh: మీ రాక్షస ఆనందం తీరిందా?.. దమ్ముంటే వచ్చి ప్రమాణం చేయండి!
- Tags
- Girlfriend
- Lover trunk
- UP
- up man
తాజావార్తలు
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!