Donald Trump: కెనడా ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేశాడు. అయితే, ఈ కెనడా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. కెనడా, అమెరికాలో విలీనమైనట్లు సూచించే ఒక ఫోటోను ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్ షేర్ చేశారు. కెనడా, అమెరికాలో భాగమైనట్లు సూచిస్తూ ‘‘ఓ కెనడా’’ అంటూ కామెంట్స్ చేశారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ తన చివరి సమయంలో తీసుకుంటున్న అధికారిక నిర్ణయాలతో పరిపాలనను, అధికార బదిలీని కష్టతరం చేస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.
బైడెన్ మాట్లాడుతూ.. 2020లో కరోనా మహమ్మారి విజృంభణ స్టార్టింగ్ లో బాధితులకు అందజేసిన రిలీఫ్ చెక్స్‌పై డొనాల్డ్ ట్రంప్ తన పేరు రాసుకుని మంచి పేరును సంపాదించుకున్నాడని ఆయన తెలిపారు. కానీ, ఆ మరుసటి ఏడాది అధ్యక్ష పదవి చేపట్టిన.. ట్రంప్ లాగా నేను చేయలేకపోయానని చెప్పుకొచ్చారుు. తానో ‘స్టుపిడ్’ అని అంటూ అతడు విచారం వ్యక్తం చేశారు.
Donald Trump: ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తాను అధ్యక్ష పదవి చేపట్టగానే అక్రమ వలసదారులు అందరినీ అమెరికా నుంచి తరిమేస్తానని వెల్లడించారు. అలాగే, చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మార్గం మరింత సులువుగా చేస్తానని కాబోయే యూఎస్ అధ్యక్షుడు తెలిపారు.
Donald trump: ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భేటీ అయ్యారు. ఫ్లోరిడాలోని ట్రంప్ మార్ ఏ లాగో ఎస్టేట్‌లో విందులో వీరిద్దరు పాల్గొన్నారు. ఇరువురు మధ్య చర్చ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అధిక సుంకాలను నివారించేందుకు కెనడాను యునైడెట్ స్టేట్స్‌లో "51వ రాష్ట్రం"గా చేయడంపై జోక్ చేశారు.
Susie Wiles: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచార మేనేజర్ సూసీ వైల్స్‌ను వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఎంపిక చేశాడు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్‌ను విజయ తీరాలకు చేర్చడంలో ఆమె కీ రోల్ పోషించింది.
ఈసారి అమెరికా ఎన్నికల్లో భారత ఓటర్లు కీ రోల్ పోషించనున్నారు. అమెరికాలో భారతీయ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇక్కడకు వచ్చి సెటిల్ అయినవారే కాకుండా.. గ్రీన్ కార్డు హోల్డర్లు కూడా ఓటు వేసే అవకాశం ఉంది.
ట్రంప్ కు వ్యతిరేకంగా అడల్ట్ ఫిల్మ్ స్టార్స్ ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఒక పోర్న్ స్టార్‌తో అతడికి సంబంధం ఉన్నప్పటికి.. అధ్యక్షుడిగా ఎన్నికైనట్లయితే.. మొత్తం పరిశ్రమను మూసివేయడానికి ప్రయత్నించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Pannun Murder Plot: పన్నూన్ హత్యకు కుట్ర కేసు దర్యాప్తులో భారత్ బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకొంటుందని తాము ఆశిస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు.
Khalistani Terrorist: గత ఏడాది ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హతమార్చేందుకు భారత రా అధికారి కుట్ర పన్నారని అమెరికా న్యాయ శాఖ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ దాడులు చేసేందుకు యత్నించారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.