Susie Wiles: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచార మేనేజర్ సూసీ వైల్స్‌ను వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఎంపిక చేశాడు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్‌ను విజయ తీరాలకు చేర్చడంలో ఆమె కీ రోల్ పోషించింది. ఎంతో పకడ్బందీగా, అత్యంత క్రమశిక్షణతో ట్రంప్ తన ప్రచారాన్ని నిర్వహించడం వెనుక ఆమె చాలా కష్టపడినట్లు సంబంధిత వర్గాల్లో పేరు పొందారు. అమెరికా చరిత్రలో మొట్టమొదటి మహిళా చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ కానుంది. ట్రంప్ తన విక్టరీ స్పీచ్ లో ఆమెకు మాట్లాడేందుకు ఛాన్స్ ఇచ్చినా.. నిరాకరించింది.
Read Also: IT Raids on Grandhi Srinivas: మూడో రోజు గ్రంధి శ్రీనివాస్ నివాసంలో ఐటీ సోదాలు
కాగా, సూసీ వెల్స్ వినూత్న ఆలోచనలు కలిగిన వ్యక్తి అని డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా గౌరవం, ప్రశంసలను పొందారని చెప్పుకొచ్చారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తారని పేర్కొన్నారు. దేశం గర్వపడేలా ఆమె పని చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. కాగా, ఫ్లోరిడాకు చెందిన సూసీ.. దీర్ఘకాలంగా రిపబ్లికన్ పార్టీ వ్యూహకర్తగా పని చేశారు. 2016, 2020ల్లో రాష్ట్రంలో ట్రంప్ ప్రచార బాధ్యతలను ఆమె తీసుకున్నారు.