UNSC: అమెరికా, ఫ్రాన్స్ తర్వాత UNSCలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం బ్రిటన్ మద్దతును పొందింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC శాశ్వత సీటు) కోసం ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ గురువారం భారతదేశానికి మద్దతు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రాన్స్‌కు చెందిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా భారత్‌కు మద్దతు పలికారు. న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 69వ సెషన్‌లో జరిగిన చర్చలో, బ్రిటిష్ ప్రధాన మంత్రి స్టార్మర్…
Kamala Harris: డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరు దాదాపు ఖరారు అయింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ (ఎక్స్)లో అధికారికంగా తెలిపింది.
US - India Relations: భారత్‌తో సైనిక సహకారాన్ని మరింత పెంచుకోవాలని అమెరికన్ కాంగ్రెస్‌లో కీలక సభ్యుడు మార్కో రుబియో గురువారం బిల్లు ప్రవేశ పెట్టారు. అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా భారత్‌ను చూడాల్సిన అవసరం ఉందన్నారు.
అమెరికాలో మరో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓక్లహామా సిటీలో ఓ హోటల్ మేనేజర్‌గా పని చేస్తున్న 59 ఏళ్ల భారతీయ-అమెరికన్ హేమంత్ మిస్త్రీ అనే వ్యక్తి పై ఓ దుండగుడు దాడి చేసి పిడిగుద్దులు కురిపించాడు. దీంతో హేమంత్ ప్రాణాలు కోల్పోయాడు.
De Kock, Rabada steer SA crush USA: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. బుధవారం ఆంటిగ్వా వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ప్రొటీస్ గెలిచింది. దక్షిణాఫ్రికా నిర్ధేశించిన భారీ లక్ష్య ఛేదనలో అమెరికా గట్టిగా పోరాడినప్పటికీ చివరికి 176/6కు పరిమితమైంది. అండ్రీస్ గౌస్ (80; 47 బంతుల్లో 5×4, 5×6) సూపర్ ఇన్నింగ్స్, హర్మీత్ సింగ్ (38; 22 బంతుల్లో 2×4, 3×6) మెరుపులు అమెరికాను గెలిపించలేకపోయాయి.…
గ్రూప్ ఆఫ్ సెవెన్ అని కూడా పిలువబడే జి 7 సమ్మిట్, ప్రపంచంలోని ఏడు అతిపెద్ద అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల నాయకుల వార్షిక సమావేశం. ఆర్థిక వృద్ధి, వాణిజ్యం, భద్రత మరియు పర్యావరణ సుస్థిరతతో సహా విస్తృత శ్రేణి ప్రపంచ సమస్యలపై విధానాలను చర్చించడం, ఆపై సమన్వయం చేయడం ఈ శిఖరాగ్ర సమావేశం ముఖ్య ఉద్దేశ్యం. ఈ సదస్సులో పాల్గొన్న జి7 దేశాలు యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్…
సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు అణ్వాయుధాలను ప్రయోగించడానికి తాము వెనకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ తో కొనసాగుతున్న వార్ అణుయుద్ధాలకు దారి తీస్తుందా? అన్న ప్రశ్నకు ఆయన ఈ మేరకు ఆన్సర్ ఇచ్చారు.
Missing: విదేశాల్లో చదువుకుంటున్న భారతీయలు ఇటీవల కాలంలో విపరీత పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రమాదాల్లో చనిపోవడం, ఇతర కారణాల వల్ల దాడులకు గురికావడం, ఇక్కడ ఉంటున్న తల్లిదండ్రుల్ని, వారి కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దక్షిణ గాజా నగరమైన రఫాపై దాడి చేయవద్దని అమెరికా, ఇతర దేశాలు ఒత్తిడి చేస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. రఫాలో పాలస్తీయన్ ప్రజలు ఖాళీ చేయాలని, సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని మరోసారి ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది.