Trump’s Inauguration: జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల అధినేతలకు, కీలక నాయకులకు, టెక్ దిగ్గజాలు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఇప్పటికే వారందరికి ఆహ్వానాలు వెళ్లాయి. యూఎస్ క్యాపిటల్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు హాజరుకాబోతున్నారు.
Read Also: Saif Ali Khan: సైఫ్ మొదటి భార్య ఎవరు, విడాకుల తర్వాత అతను ఎన్ని కోట్లు చెల్లించాడో తెలుసా??
ఆహ్వానాలు అందుకున్నవారు వీరే..
* ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి. ట్రంప్‌కి పూర్తి మద్దతుదారుగా ఉన్నారు. రైటిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు.
* చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. అయితే, ట్రంప్ ప్రమాణస్వీకారానికి జిన్‌పింగ్ తరుపున ఉన్నతస్థాయి రాయబారి వెళ్తున్నారు.
* హంగేరి ప్రధాని విక్టర్ ఓర్బన్. ట్రంప్‌కి సన్నిహిత విదేశీ మిత్రుల్లో ఓర్బన్ ఒకరు.
* అర్జెంటీనా ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో.
* ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకేలే. ట్రంప్ విజయం తర్వాత ఆయనను అభినందించిన మొదటి ప్రపంచ నాయకుల్లో ఒకరు.
* జపాన్ తరుపున విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా హాజరుకాబోతున్నారు.
* ట్రంప్-వాన్స్ ప్రమాణస్వీకార కమిటీ ఆహ్వానం మేరకు భారత విదేశంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు.
* ప్రాన్స్ జాతీయవాద నాయకుడిగా పేరున్న ఎరిక్ జెమ్మౌర్, యూకే రాజకీయ నాయకులు, ట్రంప్ మిత్రుడైన నిగెల్ ఫరాజ్ వంటి వారు హాజరవుతున్నారు.
*ఓపెన్AI సీఈఓ సామ్ అల్ట్‌మాన్, ఇతర బిలియనీర్లు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.
* మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్ హాజరుకాబోతున్నారు.