Kishan Reddy: హైదరాబాద్ పర్యటన.. ఖైరతాబాద్ లో మింట్ మ్యూజియం సందర్శించనున్న కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Kishan Reddy will visit Mint Museum in Khairatabad: ఇవాళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ పర్యటించనున్నారు. ఉదయం 10.30కు శ్రీనగర్ కాలనీలో రక్తదాన శిబిరంలో పాల్గొని, అనంతరం 11 గం.లకి ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రికి అంబులెన్స్ లను కిషన్ రెడ్డి అందజేయనున్నారు. మధ్యాహ్నం 12 గం.లకు ఖైరతాబాద్ లో మింట్ మ్యూజియం సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు కొండాపూర్, హైటెక్స్ లో చిరుధాన్యాలపై రెండు రోజులు సదస్సు ముగింపు సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.
Read also: Malakpet Accident: మూడురోజులుగా మృత్యువుతో పోరాడి శ్రావణి మృతి.. నిందితుడు అరెస్ట్
Also Read
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్ల ద్వారానే..
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
నిన్న అక్కన్నపేట-మెదక్ మధ్య రైల్వే సేవలు నేటినుంచి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.. తొలిరైలుని మంత్రి హరీశ్ రావుతో కలిసి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం కాలంలో కట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను 653 కోట్లతో ఆధునీకరిస్తామని.. ఎయిర్‌పోర్టుకి ధీటుగా నిర్మిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెలలోనే పనులు మొదలుపెడతామని అన్నారు. రైల్వే ప్రమాదాల నివారణ కోసం అనేక చర్యలు తీసుకున్నామని, మసాయిపేటలో చోటు చేసుకున్న రైల్వే ప్రమాద ఘటన విచారకరమని తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం అన్ని రైల్వే స్టేషన్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మెదక్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై అందుబాటులో ఉందన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఇప్పటివరకూ 16 జాతీయ స్థాయి అవార్డులను అందుకుందని చెప్పారు. భద్రాద్రి- సత్తుపల్లి రైల్వే లైన్ కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పూర్తయితే.. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్‌కి పోటీగా ఉంటుందని తెలిపారు. మనోహరబాద్- కొత్తపల్లి 150 రైల్వే లైన్ త్వరలోనే పూర్తవుతుందన్నారు.
రైల్వే శాఖతో ప్రధాని మోదీ ప్రతి నెల సమీక్షలు నిర్వహిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 450 కోట్లతో వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనుల్ని త్వరలో పూర్తి చేస్తామన్నారు. దీని వల్ల 3 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. చేగుంటలో టికెటింగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలని అభ్యర్థన వచ్చిందని.. అందుకు జీఎమ్ ఓకే చెప్పారని వెల్లడించారు. రామయంపేట – సిద్దిపేట రోడ్డును కూడా నేషనల్ హైవేతో కనెక్ట్ చేశామన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని.. కేంద్ర ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఈ రాష్ట్రానికి ఉంటుందన్నారు. భూములు ఇచ్చిన రైతులకు మోడీ తరపున తాను సెల్యూట్ చేస్తున్నానన్నారు. భద్రాచలం దేవాలయం అభివృద్ధి కోసం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా నిధులిచ్చామని, రామప్ప కోసం రూ. 60 కోట్ల నిధులిచ్చామని రివీల్ చేశారు.
Tirumala Brahmotsavalu: ఎల్లుండి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తాజావార్తలు
-
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..