Kishan Reddy: సెప్టెంబర్17న తెలంగాణ విమోచన దినోత్సవం.. వేడుకల్లో అమిత్ షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సంవత్సరం పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గుర్తింపు దక్కని ఉద్యమకారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిని స్మరించుకొనున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతరం అని నినాదించి జైలుకు వెళ్లిన వందేమాతరం రామచందర్ రావు కుటుంబ సభ్యులను కిషన్ రెడ్డి బేగంబజార్ లో ఆయన కలిశారు.
75 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించిన వీరులకు గుర్తింపు దక్కలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏడాది పాటు వారిని స్మరించుకుంటు, వారి జయంతి , వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తామన్నారు. 1948 లో అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ నగరంలో జాతీయ జెండాను ఎగురవేసి నిజాం పాలనకు చరమగీతం పాడరాని, ఈ ఏడాది సెప్టెంబర్17న హైదరాబాద్ నగరంలో హోమ్ శాఖ మంత్రి అమిత్ షా జాతీయ జెండా ఎగురవేస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో అధికారికంగా విమోచన వేడుకల్లో పాల్గొంటారని అన్నారు. పల్లెల్లో పోరాటాల స్ఫూర్తిగా నిర్మించిన బురుజులను అలంకరించి జాతీయ జెండాలను ఎగురవేయాలని పిలుపు నిచ్చారు.
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్17 ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. గత పాలకులు సెప్టెంబర్17 ప్రాముఖ్యత తెలియకుండా మరుగున పడేశారని మండిపడ్డారు. బీజేపీ నేతలపై కేసులు పెట్టారు తప్పా, హైదరాబాద్ విముక్తి ఉత్సవాలను ఏ ప్రభుత్వం నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా కార్యక్రమంగా సెప్టెంబర్17న తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామన్నారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధులను స్మరించుకొని వారి కుటుంబాలను కలిసి సన్మానం చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.
Asaduddin Owaisi: నితీష్ కుమార్ “గోద్రా అల్లర్ల” సమయంలో బీజేపీలోనే ఉన్నారు.
తాజావార్తలు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!