Kishan Reddy: నా ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం రాహుల్ కు ఉందా? చర్చకు సిద్దమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: రాహుల్ గాంధీకి దమ్ము దైర్యం ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, రాహుల్ చర్చలు సిద్దమా? అని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి రాహుల్ కు సవాల్ విసిరారు. తెలంగాణలో రాహుల్, ప్రియాంక గాంధీ పర్యటిస్తున్నారని తెలిపారు. రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్నారు.. ఈ సందర్భంగా పిఎం మోడీకి ధన్యవాదాలు తెలపాలని అన్నారు. రామప్ప దేవాలయాన్ని పీఎం అభివృద్ధి చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్, ప్రియాంక లు వాస్తవాలను వక్రీకరించి మాట్లాడారని మండిపడ్డారు. రాహుల్ కు జ్ఞాపక శక్తి తగ్గినట్లు ఉందని, రాహుల్ కు మతిమరుపు పెరిగిందని అన్నారు. వాస్తవాలు మర్చి పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ కు కొన్ని ప్రశ్నలు అడుగుతున్న.. రాహుల్ కు దమ్ము దైర్యం ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. 2004లో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టు కాలేదా? అధికారం పంచుకోలేదా? మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉంటే కేసీఆర్ కేంద్ర మంత్రిగా లేరా? రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ లో టీఆర్ఎస్ వాళ్ళు మంత్రులు కాలేదా? 2014 లో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మేల్యేలు.. ఏ పార్టీలోకి వెళ్లి చేరారు? ఎవరికి ఓటు వేస్తే ఎవరికి లాభం జరిగింది? కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మేల్యేలు టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ కు మడుగులు వత్త లేదా? అంటూ ప్రశ్నించారు.
ఎవరికి ఎవరు బిటిమ్.. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ బిటీమ్ అన్నారు. 2013 లో టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో మెర్జ్ చేసేందుకు చర్చలు జరగలేదా? అని ప్రశ్నించారు. ఎవరికి ఎవరు బిటిమో రాహుల్ చెప్పాలి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ పై ఓటుకు నోటు కేసు ఏమయింది? ఎందుకు తొక్కి పెట్టారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు మధ్యవర్తిగా మజ్లిస్ ను పెట్టుకున్నారని మండిపడ్డారు. మూడు పార్టీలు కలిసి అట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు పార్టీల DNA ఒక్కటే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి అవగాహనతో మూడు పార్టీలు పని చేస్తున్నాయని సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాహుల్ చర్చలు సిద్దమా? అని సవాల్ విసిరారు. డిల్లీ ఐనా, హైదరాబాద్ అయినా రాహుల్ తో నేను చర్చకు సిద్దం అని అన్నారు. బీజేపీ జాబితా సిద్దం కాగానే చెప్తామని అన్నారు. రాజాసింగ్ వ్యవహారం మా అంతర్గతం అన్నారు. సస్పెన్స్ ఎత్తివేస్తే రాజాసింగ్ పోటీలో ఉంటారని స్పష్టం చేశారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమన్నారు. అభ్యర్థుల కసరత్తు ప్రారంభం చేశామన్నారు.
Tiger Nageswarara Rao : టైగర్ నాగేశ్వరావు గ్రాఫిక్స్ కోసం అంత టైం పట్టిందా..?
Also Read
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
తాజావార్తలు
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
-
Regina Cassandra : హీరోయిన్ నుండి విలన్ పాత్రలకు షిఫ్ట్ అయిన రెజీనా కాసాండ్రా
-
OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
-
Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
-
Karthi30: ‘మార్షల్’ కంటే ముందే ‘కార్తి30’ పూర్తి?.. షూటింగ్ షెడ్యూల్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!