యాదాద్రి జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. పోచంపల్లి మండలం గౌస్ కొండ, రేవనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి.. కొనుగోలు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు కిషన్ రెడ్డికి తమ సమస్యలు చెప్పుకున్నారు. కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుంది.. హమాలీల కొరత ఉంది.. ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పించడం లేదు.. బస్తాలు, తర్పలిన్, సూతిల్ కూడా లేవని కిషన్ రెడ్డికి రైతులు చెప్పారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళన చేయాల్సిందే... నీళ్లు ఇవ్వాల్సిందేనని అన్నారు. కృష్ణా, గోదావరి నదుల నుండి తీసుకువచ్చిన అభ్యంతరం లేదని తెలిపారు. ఒక్క ఇల్లు కూలగొట్టిన ఊరుకునేది లేదు.. ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వ రోజ్‌గార్ మేళాలో భాగంగా నేడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను ప్రధాని, కేంద్ర మంత్రులు నేడు అందజేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 51 వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 155 మందికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు.
ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2014 లో బీజేపీ సభ్యత్వ సేకరణ తర్వాత 2024 లో చేస్తున్నామన్నారు.
రేపు సికింద్రాబాద్ - వాస్కోడిగామా మధ్య కొత్త ట్రైన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ రైలు హైదరాబాద్ నుంచి కర్ణాటక , గోవాకు వెళ్లే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండనుంది.
మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భరోసా కల్పించారు మూసీ సుందరీకరణలో నిర్వాసితులవుతున్న కుటుంబాలను బాధితులను పరామర్శించారు. అంబర్‌పేట్ నియోజకవర్గంలోని ముసారాంబాగ్, అంబేద్కర్ నగర్ నుంచి తులసి నగర్ మీదుగా కృష్ణానగర్ వరకు బస్తీల్లో నిర్వాసితులను స్వయంగా కలిసి, వారి గోడును ఆవేదనను విన్నారు.
Kishan Reddy: వక్ఫ్ బోర్డు బిల్ తెచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ ఆస్తులు కబ్జా కాకుండా ఉండేందుకు ఈ బిల్ తీసుకువచ్చామని అన్నారు.
G. Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి రైల్వే టర్మినల్స్‌కు వెళ్లే రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి..