South Central Railway: దక్షిణ మధ్య రైల్వే నాలుగు రైల్వే సర్వీసులను పొడిగించింది.. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా కాజీపేట్, రాయచూర్, కర్నూల్ సిటీ, బోధన్ స్టేషన్లకు రైల్వే సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. కొత్త రైళ్లకు బదులు ఉన్నవాటిని పొడిగించింది రైల్వేశాఖ.. ఇక, నాలుగు కొత్త సర్వీసులను ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. పూణె – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట్ వరకు.. నాందేడ్ – తాండూరు ఎక్స్‌ప్రెస్‌ను రాయచూర్ వరకు పొడిగించారు అధికారులు.. ఇక, జైపూర్ – కాచిగూడ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను కర్నూల్ సిటీ వరకు పొడిగించారు. కరీంనగర్ – నిజామాబాద్ ప్యాసింజర్ రైలును బోధన్ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోగా.. నేడు జెండా ఊపి ప్రారంభించారు కిషన్‌రెడ్డి.. ఇక, ఈ రోజు నుంచి ప్రయాణికులకు ఈ కొత్త రైల్వే సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
కొత్త గా నాలుగు రైల్వే సర్వీస్ లను ప్రారంభించడం సంతోషంగా ఉంది. తెలంగాణలో చాలా ప్రాంతాలకు రైల్వే సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నాం అన్నారు కిషన్‌రెడ్డి.. సంక్రాంతి పండుగ నాడు హైదరాబాద్ నుంచి విశాఖకు వందే భారత ట్రైన్ లాంచ్ చేశాము.. తిరుపతి – సికింద్రాబాద్ కు వందే భారత్ సర్వీస్.. రీసెంట్ గా హైదరాబాద్ నుంచి బెంగుళూర్ కు వందే భారత్ ప్రధాని ప్రారంభించారు.. దేశం లో ఇప్పటి వరకు 34 వందే భారత్ లు ఉంటే తెలంగాణ కు 3 వందే భారత్ ట్రైన్స్ ఇచ్చాం.. ఎప్పటి కప్పుడు కొత్త నెట్ వర్క్ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ కు రైల్ వే బడ్జెట్ 2.58 కోట్లు ఉండే 5వేల కోట్లకు పెంచింది.. తెలంగాణ లో 720 కోట్ల తో తెలంగాణ లో ఆధునీకరిస్తున్నం.. చర్లపల్లి రైల్ వే టర్మినల్ పూర్తి చేసి జనవరి లో సంక్రాంతికి డేడికేట్ చేయాలనే పనులు కొనసాగిస్తున్నారు.. ఎంఎంటిఎస్ పనులు కొనసాగుతాయన్నయి.. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే యాదాద్రి వరకు రెండో దశ సర్వీస్ లను అందుబాటులోకి తెస్తాం అన్నారు. ఆర్ఎమ్ యూ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం అవుతున్నాయి.. కొత్త రైలేవ్ నెట్ వర్క్ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రైల్వే సర్వేలు చేపడుతుంది.. నరేంద్ర మోడీ నాయకత్వం లో రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.