Russia Condemns Western Blackmail: ఇండియాలో జరుగుతున్న జీ20 విదేశాంగ మంత్రుల సమావేశాలకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో పాశ్చాత్యదేశాలు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాయని, ఇందుకు జీ20 సమావేశాలను వేదికగా ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని సంస్కరించడానికి ఇదే మంచి సమయం అని లావ్రోవ్ అన్నారు. వెస్ట్రన్ దేశాలు అనేక ఏళ్లుగా రష్యాపై యుద్ధానికి ప్రయత్నిస్తున్నాయని, అందుకే ఉక్రెయిన్ కు భారీగా ఆయుధాలను అందిస్తున్నాయని దుయ్యబట్టారు.
Russia-Ukraine War: సరిగ్గా ఏడాది క్రితం ఫిబ్రవరి 24, 2022లో ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ప్రారంభం అయింది. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య రావణకాష్టంలా ఈ యుద్దం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్, రష్యాలు తీవ్రంగా నష్టపోతున్నా, ఇరు దేశాలు పట్టు వీడటం లేదు. గతేడాది ఇదే రోజు తెల్లవారుజామున పెద్ద ఎత్తున రష్యా బలగాలు ఉక్రెయిన్ పై సైనికచర్యను ప్రారంభించాయి. ఈ యుద్ధం ఇరు దేశాలపైన మాత్రమే ప్రభావం చూపించలేదు. ప్రపంచంలో ప్రతీ…
RUSSIA-UKRAINE WAR: ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసి ఏడాది గడుస్తున్న సందర్భంగా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని, తక్షణమే తమ బలగాలను ఉపసంహరించుకోవాలని రష్యాను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అయితే ఈ తీర్మానానికి మెజారిటీ దేశాలు ఆమోదం తెలిపాయి.
Donald Trump on Russia-Ukraine conflict: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలో ఉంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే వాడిని అని ట్రంప్ వెల్లడించారు. నేను అధ్యక్షుడిగా ఉంటే మిలియన్ సంవత్సరాల్లో కూడా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదని అన్నారు.
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్దం ప్రారంభం అయి 11 నెలలు గడుస్తోంది. వచ్చే నెలతో ఏడాది పూర్తవుతుంది. అయినా కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. తప్పితే తగ్గడం లేదు. గతేడాది ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ పై సైనిక చర్యను ప్రారంభించింది. అయితే సైనికపరంగా శక్తివంతమైన రష్యా ముందు ఉక్రెయిన్ వారం రోజుల్లో లొంగిపోతుందని అంతా అనుకున్నప్పటికీ.. పాశ్చాత్య దేశాలు, అమెరికా, నాటో కూటమి ఇచ్చే ఆర్థిక, సైనిక సహకారంతో ఉక్రెయిన్, రష్యాను…
Ukraine Chopper Crash: ఉక్రెయిన్ లో ఘోరం జరిగింది. రాజధాని కీవ్ కు సమీపంలో ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఉక్రెయిన్ హోంమంత్రి, డిప్యూటీ హోంమంత్రితో సహా మొత్తం 16 మంది మరణించారు. ఉక్రెయిన్ అధికారులు బుధవారం ఈ ప్రమాదం గురించి తెలిపారు. చనిపోయిన వారిలో హోం మంత్రి డెనిస్ డెనిస్ మొనాస్టైర్స్కీ మరియు అతని మొదటి డిప్యూటీ మినిస్టర్ యెవ్జెనీ యెనిన్‌తో సహా అంతర్గత మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. మరణించిన…
Ukraine War: ఉక్రెయిన్ పై మరోసారి రష్యా విరుచుకుపడింది. శనివారం క్షిపణులతో దాడి చేసింది. రష్యాతో జరుగుతన్న యుద్ధంతో ఉక్రెయిన్ కు యుద్ధ ట్యాంకులను అందచేస్తామని బ్రిటన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే రష్యా, ఉక్రెయిన్ పై భీకరదాడులు చేసింది. ఇదిలా ఉంటే రష్యా క్షిపణల శిథిలాలు తమ భూభాగంలో పడ్డాయని మల్డోవా దేశం ఆరోపించింది. తూర్పు ప్రాంతంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన డ్నిప్రోలో పై క్షిపణులతో దాడి చేసింది.
Russian opposition leader's comments on Putin's murder: రష్యా ప్రతిపక్ష నేత ఇలియా పోనోమరేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన నెక్ట్స్ బర్త్ డే జరుపుకోడని..అతని అంతర్గత వ్యక్తులే అధ్యక్షుడిని చంపుతారని అన్నారు. హేగ్( అంతర్జాతీయ కోర్టు)లో పుతిన్ ను చూడటం తన వ్యక్తిగత కలళ అని దేశం నుంచి బహిష్కరించబడిని ప్రతిపక్ష నేత ఇలియా పోనోమరేవ్ అన్నారు. అయితే ఇది నెరవేరుతుందని తాను అనుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
There Will Be No Third World War Says zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ మంగళవారం గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రధానోత్సవంలో వర్చువల్ గా ప్రసంగించారు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి ప్రపంచ యుద్దంలో మిలియన్ల మంది, రెండో ప్రపంచ యుద్ధంలో పది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని..అయితే మూడో ప్రపంచ యుద్ధం ఉందని ఆయన అన్నారు. స్వేచ్ఛా ప్రపంచం సహాయంతో రష్యా దురాక్రమణను ఉక్రెయిన్ ఆపుతుందని అన్నారు.