Russia Announces Deal To Boost Oil Supplies To India: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో యూరోపియన్ దేశాలు రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలును నిలిపివేశాయి. అయితే రష్యా తన మిత్రదేశాలు అయిన ఇండియా, చైనాకు క్రూడ్ ఆయిల్ ను అత్యంత చౌకగా అందిస్తోంది. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు భారత్ పై ఒత్తిడి చేస్తున్నా మోదీ ప్రభుత్వం దృఢంగా వ్యవహరిస్తోంది. మా ప్రజలు అవసరాలకు అనుగుణంగా ఎక్కడ తక్కువ ధరకు చమురు దొరికితే అక్కడ…
Russia Says Oil Sales To India: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఆర్థికంగా ఏకాకిని చేసి, రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీద్దాం అనుకున్న అమెరికా, యూరోపియన్ దేశాలకు ప్లాన్ బెడిసికొట్టింది. భారత్, చైనా రూపంలో బలమైన మార్కెట్లను రష్యా ఆదాయంగా మలుచుకుంది. ఈ రెండు దేశాలకు కావాల్సిన చమురును అత్యంత చౌకగా రష్యా అందిస్తోంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రష్యా నుంచి భారత్ కు క్రూడ్ ఆయిల్ దిగుమతులు పెరిగాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐరోపా దేశాల్లో అమెరికా అణ్వాయుధాలను మోహరించినట్లే బెలారస్‌లో తాము అణ్వాస్త్రాలను ఉంచే యోచనలో ఉన్నట్లు పుతిన్ పేర్కొన్నారు.
Jinping Russia Visit: ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా ఆధిపత్యం రష్యా, చైనాలను మరింత దగ్గర చేస్తోంది. నాటోకు వ్యతిరేకంగా ఈ రెండు దేశాలు మరో కూటమిని కట్టే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ రష్యా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో జపాన్ ప్రధాని కిషిడా ఉక్రెయిన్ లో పర్యటించడం ప్రపంచం రెండు వర్గాలుగా చీలిపోతున్న విషయం కనిపిస్తోంది.
Russia: రష్యా-ఉక్రెయిన్ యద్ధాన్ని విమర్శించి పాప్ స్టార్ డిమానోవా(35) ఓ నది ప్రమాదంలో మరణించినట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఆయన అసలు పేరు డిమిత్రి స్వర్గునోవ్. ఆయన ప్రముఖ సంస్థ క్రీమ్ సోడా వ్యవస్థాపకుడు. డీమానోవా తన సోదరుడు ముగ్గరు స్నేహితులతో కలిసి మార్చి 19న గడ్డకట్టిన వోల్గా నది దాటుతుండగా మంచులో పడిపోయి మరణించారు. అతడి ఇద్దరు స్నేహితులను రక్షించగా.. మూడో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ఓ ఉన్నత పాఠశాలపై రష్యా డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు గాయపడినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. కీవ్‌లోని స్కూల్‌పై రష్యా రాత్రిపూట ఈ దాడి చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులు ఐఫోన్లు వాడొద్దనే ఆదేశాలు అధికారులకు వెళ్లాయి. అధ్యక్ష భవనం క్రెమ్లిన్ నుంచి ఈ ఆదేశాలు వెలువడ్డాయి. అమెరికా తయారీ ఐఫోన్ కావడంతో పాశ్చాత్య దేశాలు నిఘా పెంచే అవకాశం ఉండటంతో క్రెమ్లిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తవి కొనొద్దని, ఉన్నవాటిని పక్కన పారేయాలని అధికారులను ఆదేశించారు.
Japan PM Kishida Visits Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం సంభవించింది. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఉక్రెయిన్ లో ఆకస్మిక పర్యటన చేశారు. ప్రధాని కిషిడా ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించారు. ఈ నెలలో 19 నుంచి 21 వరకు ఆయన భారత్ లో పర్యటించారు. ఇదే దేశాల మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. ఆ తరువాత ఆయన ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ప్రభుత్వ విమానంలో కాకుండా చార్టెడ్ విమానంలో పోలాండ్…
Putin Visits Mariupol: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆక్రమిత ఉక్రెయిన్ లో ఆకస్మికంగా పర్యటించారు. మారియోపోల్ నగరాన్ని సందర్శించారు. యుద్దం ప్రారంభం అయిన తర్వాత ఈ నగరాన్ని రష్య ఆక్రమించింది. తాజాగా మొదటిసారిగా పుతిన్ ఈ నగరాన్ని సందర్శించారు. వేలాది మంది ఉక్రెయిన్ పిల్లలపై రష్యా అకృత్యాలకు పాల్పడిందని ఇంటర్నెషనల్ క్రిమినల్ కోర్టు పుతిన్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఈ పర్యటన జరిగింది.
Donald Trump: అమెరికాలో వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ నేత డొనాల్డ్ ట్రంప్ పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇప్పటికే రిపబ్లిక్ పార్టీ నుంచి ఆయన జూనియర్ నిక్కీ హేలి ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో కీలక వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్దం ఆపేసత్తా నాకే ఉందని ఆయన అన్నారు. అధ్యక్షుడు జో బైడెన్ రష్యాను చైనా చేతుల్లో పెట్టారని విమర్శించారు.