ఇప్పుడు ప్రపంచమంతటా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన స్టయిలే వేరంటున్నారు. పుతిన్ మాటలకు అర్థాలే వేరు?పుతిన్ యస్ అన్నాడంటే..అది నో….నో అన్నాడంటే అది పక్కా ఎస్. మాట ఒకటి…చేత ఇంకోటి. మొన్న క్రిమియాపై అదే బాట. ఆ తర్వాత డాన్ బాస్ పై అదే పాట. ఉక్రెయిన్ వార్ పై అదే తీరు. ఇప్పుడు లేటెస్టుగా ఆయన నోటి నుంచి జాలువారిన మరో డైలాగ్ బాంబ్, అణ్వస్త్ర సంసిద్ధత. మరి రష్యా అధ్యక్షుడి…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఇతర దేశాలపై పడుతోంది. ముఖ్యంగా విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖార్కివ్ నగరంలో జరిగిన రష్యా రాకెట్ దాడిలో భారతీయ విద్యార్ధి మరణించినట్టు తెలుస్తోంది. కర్నాటకకు చెందిన విద్యార్ధిగా భారత విదేశాంగ శాఖ తెలిపింది. మృతి చెందిన విద్యార్థి కుటుంబంతో మాట్లాడుతున్నామని చెప్పింది విదేశీ వ్యవహరాల శాఖ. విద్యార్ఘి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది విదేశీ వ్యవహరాల శాఖ. విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన అధికారి దీనిని ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు.
ఉక్రెయిన్ లో చిక్కుకుని పోయిన భారతీయ విద్యార్ధులకు ఊరట లభిస్తోంది. మోడీ ప్రభుత్వం వివిధ దేశాలతో దౌత్యసంబంధాలు నెరపింది. దీంతో భారతీయ విద్యార్థులకు పోలాండ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎలాంటి వీసా లేకుండా భారతీయ విద్యార్థులను తమ దేశంలోకి అనుమతిస్తామని పోలాండ్ ప్రకటించింది. ఉక్రెయిన్ నుంచి వచ్చే విద్యార్థులకు తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తామని తెలిపింది. ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ నుంచి తప్పించుకున్న భారతీయ విద్యార్థులను ఎలాంటి వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించే అవకాశం కలిగింది. పోలాండ్…
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దురాగతాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఉక్రెయిన్‌లో జరుగుతున్న ప్రస్తుత సంఘటనల గురించి, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి సోషల్ మీడియాలోనూ తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఇప్పుడు సమంత, కాజల్ అగర్వాల్ వంటి సౌత్ సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ విషయంపై సమంతా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టును షేర్ చేసింది. Read Also : RC15 video leaked : షూటింగ్ లో చెర్రీ…
ఏపీ టికెట్ రేట్లు, థియేటర్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న మొండి వైఖరిపై అన్ని వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ విషయంపై పెదవి విరుస్తుండగా, తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. “భీమ్లా నాయక్” సినిమా విషయంలో జగన్ తీరు ఉగ్రవాదాన్ని తలపిస్తోందని మండిపడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి వరుస ట్వీట్లు చేశారు. Read Also :…