Ukraine War: ఉక్రెయిన్ లో కుప్పకూలిన హెలికాప్టర్..హోంమంత్రి సహా 18 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine Chopper Crash: ఉక్రెయిన్ లో ఘోరం జరిగింది. రాజధాని కీవ్ కు సమీపంలో ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఉక్రెయిన్ హోంమంత్రి, డిప్యూటీ హోంమంత్రితో సహా మొత్తం 18 మంది మరణించారు. ఉక్రెయిన్ అధికారులు బుధవారం ఈ ప్రమాదం గురించి తెలిపారు. చనిపోయిన వారిలో హోం మంత్రి డెనిస్ డెనిస్ మొనాస్టైర్స్కీ మరియు అతని మొదటి డిప్యూటీ మినిస్టర్ యెవ్జెనీ యెనిన్‌తో సహా అంతర్గత మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. మరణించిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా, ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఓ స్కూల్ పై హెలికాప్టర్ కూలడం వల్ల చిన్నారులు చాలా మంది గాయాల పాలయ్యారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
Read Also: Kanti Velugu: రెండో విడత కంటి వెలుగు ప్రారంభం.. ప్రారంభించిన జాతీయ నేతలు
Also Read
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
42 ఏళ్ల మొనాస్టైర్స్కీ 2021లో హోంమంత్రిగా నియమితులయ్యారు. ఈ ప్రమాదంలో సమీపంలోని 10 మంది పిల్లలతో పాటు 22 మందికి గాయాలు అయ్యాయి. రాజధాని కీవ్ కు ఈశాన్యంగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రోవరీ పట్టణంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఘటన జరిగిన వెంటనే అత్యవసర సేవలు సంఘటన స్థలానికి చేరుకున్నాయని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. హెలికాప్టర్ కూలిపోవడంపై రష్యా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆదే సమయంలో రష్యా నుంచి దాడి ఎదుర్కొన్నట్లు కీవ్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదిలా ఉంటే గత వారం నుంచి రష్యా తీవ్ర స్థాయిలో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. అమెరికా, బ్రిటన్ నుంచి సైనిక సాయం పొందిన ఉక్రెయిన్ పై వరసగా దాడులు చేస్తోంది రష్యా. ఇటీవల రష్యా దాడులను తట్టుకోవడానికి, ఉక్రెయిన్ ఇటీవలి వారాల్లో పాశ్చాత్య మద్దతుదారులను అధునాతన ట్యాంకులు పొందుతోంది. బ్రిటన్, ఉక్రెయిన్‌కు 14 ఛాలెంజర్ ట్యాంకులను ఇస్తున్నట్లు ప్రకటించింది. వారాంతంలో తూర్పు నగరమైన డ్నిప్రోలోని నివాస భవనాన్ని రష్యా క్షిపణి ఢీకొనడంతో ఆరుగురు పిల్లలతో సహా 45 మంది మరణించిన విషాదం నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది.
#Brovary. It is impossible to believe. 17 dead, including 2 children. The Minister of Internal Affairs, the First Deputy Minister and the Secretary of State died. My deepest condolences😞
📹 Brovary's auditor pic.twitter.com/djAU1v3ya6
— Kira Rudik (@kiraincongress) January 18, 2023
తాజావార్తలు
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!