ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర యుద్ధం చేస్తోంది.. రెండు దేశాల మధ్య యుద్ధం 44వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్‌పై మళ్లీ రాకెట్ దాడులతో విరుచుకుపడుతోంది. బాంబులు, క్షిపణులు, రాకెట్ దాడులతో ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. కీవ్ నుంచి పుతిన్ సేనలు నిష్క్రమించినప్పటికీ మిగతా చోట్ల విధ్వంసక చర్యలు కొనసాగిస్తూ ప్రాణాల్ని బలితీసుకుంటున్నాయి. తాజాగా తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్స్ ప్రాంతం క్రమటోర్స్క్ రైల్వే స్టేషన్‌పై జరిగిన రెండు మిసైల్ దాడుల్లో కనీసం 35 మంది మృతిచెందారు. 100…
ఉక్రెయిన్‌పై మళ్లీ భీకర యుద్ధం చేస్తోంది రష్యా… ఓవైపు చర్చలు అంటూనే.. అప్పుడప్పుడు తాత్కాలికంగా యుద్ధానికి బ్రేక్ ఇస్తున్న రష్యా బలగాలు.. అంతర్జాతీయంగా రోజురోజుకీ తీవ్రమైన ఆంక్షలు వస్తున్నా.. ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు.. మరోసారి ఉక్రెయిన్‌పై బాంబులపై వర్షం కురిపించింది.. తూర్పు ఉక్రెయిన్‌ను టార్గెట్ చేసిన రష్యా బలగాలు.. రైల్వేస్టేషన్‌పై రాకెట్ దాడులకి దిగింది.. ఈ ఘటనలు 30 మందికి పైగా పౌరులు మృతిచెందారని ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది.. ఇక, 100 మందికి పైగా…
ఉక్రెయిన్ రాజధానికి అడ్డుగోడగా నిలిచిన బుచా సిటీని సర్వనాశనం చేసింది రష్యా. వందలాది మందిని ఊచకోత కోసింది. ఈ ఘటన ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ప్రపంచ దేశాలు రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధ నేరాలకు పాల్పడుతున్న పుతిన్ దర్యాప్తును ఎదుర్కోవాల్సిందే అని హెచ్చరిస్తున్నాయి. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా, యూరప్ సిద్ధమయ్యాయి. బుచా ఘటనలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశమైంది. ఐక్యరాజ్యసమితిలో బుచా మరణాలపై స్వతంత్ర దర్యాప్తునకు భారత్ కూడా మద్దతు తెలిపింది. బుచా…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది.. ఓవైపు శాంతి చర్చలు.. మరోవైపు దాడులు జరుగుతూనే ఉన్నాయి.. ఉక్రెయిన్‌లోని నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను కూడా వదలకుండా భీకరంగా విరుచుకుపడుతున్నాయి రష్యా బలగాలు.. ఉక్రెయిన్ సైన్యం కూడా ధీటుగా రష్యాను ఎదుర్కొంటోంది.. అయితే, ఇప్పుడు పరిస్థితి కాస్త రివర్స్ అయినట్టు కనిపిస్తోంది.. ఎందుకంటే.. ఉక్రెయిన్ ఇప్పుడు రష్యా భూభాగంలోకి వెళ్లి దాడులు చేస్తోంది.. తమ భూభాగంలో ఉక్రెయిన్ తొలి వైమానిక దాడి చేసిందని రష్యా చెబుతోంది.. బెల్గోరోడ్…
భారత దేశంలో వంటనూనెలు మంట పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారత్‌కు వంటనూనె దిగుమతులు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశంలో నూనె ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి వంటనూనెను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించిన భారత్.. ఆ దేశం నుంచి 45 వేల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను కొనుగోలు చేసింది. ఈ దిగుమతుల కోసం భారీ ధర చెల్లించింది. పామాయిల్ సరఫరాను పరిమితం చేయాలని ఇండోనేషియా నిర్ణయించడం, దక్షిణ…
రష్యా దాడితో ఉక్రెయిన్ దేశం అతలాకుతలం అవుతోంది. అక్కడి ప్రజలు కనీస అవసరాలు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బ్రిజేంద్ర రానా అనే వ్యాపారి ఉక్రెయిన్‌కు తన వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటివరకు రూ.40 కోట్లు విలువైన వైద్య పరికరాలు, ఉత్పత్తులను ఉక్రెయిన్దేశానికి ఉచితంగా అందించారు. 1992లో ఉక్రెయిన్‌కు వెళ్లిన బ్రిజేంద్ర రానా అక్కడి ఖార్కీవ్ నగరంలోనే వైద్య విద్యను అభ్యసించారు. చదువు పూర్తయిన తర్వాత అక్కడే స్నేహితులతో కలిసి ఫార్మాసుటికల్ కంపెనీని…
ఉక్రెయిన్ పై నెలరోజులకు పైగా యుద్దోన్మాదంతో రెచ్చిపోతున్న రష్యా, అనూహ్యంగా ఒక కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ పై వార్‌లో తొలి దశ ముగిసిందని తెలిపింది. ఇక తూర్పు డాన్ బాస్ ప్రాంతాలపై దృష్టిసారిస్తామని రష్యన్ మిలటరీ ప్రకటించింది. డొంటెస్క్, లుహాంస్క్ లలో రష్యా అనుకూల తిరుగుబాటు దారుల ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. పూర్తిస్తాయిలో వీటిని ఆక్రమించేందుకు వ్యూహం మార్చింది మాస్కో. ఉక్రెయిన్ ప్రతిఘటనతో విసిరివేసారుతున్న రష్యన్ మిలటరీ, చిన్నచిన్న లక్ష్యాల వైపు అడుగులెయ్యాలని వ్యూహం మారుస్తున్నట్టు కనపడుతోంది.…
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలై నెలరోజులు కావస్తోంది. ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై కనిపించటం ప్రారంభమైంది. ముడి చమురు, ఇందన ధరలతో పాటు నిత్యావసరాలైన వంట నూనెలు, ప్యాక్డ్ ఐటెమ్స్, కూరగాయల ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. మున్ముందు ఈ ధరల భారంతో సామాన్యుడు మరింతగా కుదేలయ్యే ప్రమాదం ఏర్పడింది. కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే సామాన్యుడి జీవన శైలి ఘోరంగా దెబ్బతింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడుదుడుకులకు లోనయ్యాయి.…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. అయితే, బాధిత దేశంగా ఉన్న ఉక్రెయిన్‌తో పాటు.. అంతర్జాతీయంగా ఆక్షంల నేపథ్యంలో.. రష్యాలోనూ దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.. నీళ్ల ట్యాంకు దగ్గర బిందెల ఫైట్‌లా కొట్టుకుంటున్నారు. రేషన్ షాపు క్యూలైన్లలో మాదిరి పోట్లాడేసుకుంటున్నారు. తెరవకముందు నుంచే సూపర్ మార్కెట్ల ముందు పడిగాపులు పడి… ఓపెన్ చెయ్యగానే కిందామీదా పడి క్షణాల్లో ఖాళీ చేసేస్తున్నారు. ఇదంతా ప్రస్తుతం రష్యాలో పరిస్థితి.. రష్యాలోని ఓ సూపర్ మార్కెట్ లో చోటు చేసుకున్న ఘటన…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరణాల లెక్కలు ఊహకు అందడం లేదు. అంతేలేకుండా సాగుతున్న ఈ సమరంలో, ఇప్పటి వరకు దాదాపు 10వేలమంది రష్యన్ సైనికులు చనిపోయారని తాజాగా వెల్లడించింది రష్యన్ ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థ కొమ్సో. అయితే ఏమైందో ఏమోగాని వెంటనే ఆ కథనాన్ని తొలగించింది. అయితే, అప్పటికే ఆ వివరాలు ప్రపంచమంతా పాకిపోయాయి. రష్యా రక్షణ శాఖ గణాంకాలను కోట్ చేస్తూ, కొమ్సో మీడియా చెప్పిన దాని ప్రకారం, 9,861 మంది రష్యన్ సైనికులు చనిపోయారు.…